గూగుల్ క్లౌడ్‌ను సక్సెస్‌ఫుల్‌గా నడిపిస్తున్న భారతీయుడు.. ఎవరీ థామస్ కురియన్

ప్రముఖ టెక్ దిగ్గజం గూగుల్‌ని ఇప్పటికే భారత సంతతికి చెందిన సుందర్ పిచాయ్ నడిపిస్తున్నారు.అంతేకాదు గూగుల్‌లో పలువురు భారతీయులు కీలక స్థానాల్లో వున్నారు.

 The Kerala-born Executive Who Turned Around Google Cloud, Google Cloud, Kerala M-TeluguStop.com

వారిలో ఒకరు థామస్ కురియన్.ఈయన ప్రస్తుతం గూగుల్ క్లౌడ్ విభాగానికి అధిపతిగా విధులు నిర్వర్తిస్తున్నారు.

నవంబర్ 2018లో గూగుల్ క్లౌడ్ డివిజన్ చీఫ్ డయాన్ గ్రీన్.త్వరలో తాను బాధ్యతల నుంచి తప్పుకుంటున్నానని, తన స్థానంలో థామస్ కురియన్ కొత్త బాస్‌గా పగ్గాలు అందుకుంటారని తన సిబ్బందితో చెప్పారు.

ఈ మేరకు ఓ రోజున సిబ్బందితో ముఖాముఖీ నిర్వహించిన గ్రీన్.థామస్ కురియన్ ఒరాకిల్ నుంచి రాబోతున్నట్లు తెలిపారు.క్లౌడ్ విభాగంలో గూగుల్‌కు ఒరాకిల్ ప్రత్యర్థి.ఈ నేపథ్యంలో కురియన్ గూగుల్ క్లౌడ్‌ను ఎలా నడిపిస్తారా అని సిబ్బందిలో ఆందోళన వుండేది.

అయితే రెండేళ్లు తిరిగే సరికి కురియన్ అద్భుతాలు చేశారు.ఆయన పర్యవేక్షణలో గూగుల్ క్లౌడ్ ఆదాయం రెట్టింపు అయింది.గూగుల్ మాతృసంస్థ ఆల్ఫాబెట్ కంటే కూడా వేగంగా వృద్ధి చెందుతోంది.కోవిడ్ 19 కాలంలో గూగుల్ కొత్త నియామకాలకు తాత్కాలిక విరామం ఇచ్చింది.

అదే సమయంలో గూగుల్ క్లౌడ్‌లో మాత్రం కొత్త ఉద్యోగులను తొలగించారు.కంపెనీలోని ఇతర విభాగాలు అంతర్గత వనరుల కోసం పోరాడటమో , మూసివేయడమో చేశాయి.

కానీ క్లౌడ్ యూనిట్‌కి మాత్రం పెట్టుబడి విషయంలో ఎలాంటి ఢోకా లేకుండా పోయింది.ఈ విభాగం 37000 మంది సిబ్బందితో బలంగా ఉంది.

కురియన్ పగ్గాలు చేపట్టినప్పుడు ఈ సంఖ్య 25000 మాత్రమే.జూలై 27న గూగుల్ క్లౌడ్ బిజినెస్‌ను విస్తరించడంలో కురియన్ సాధించిన పురోగతిపై ఆల్ఫాబెట్ తన పెట్టుబడిదారులకు తెలియజేయనుంది.రెండవ త్రైమాసికంలో క్లౌడ్ ఆదాయం 45 శాతం పెరిగి 4.35 బిలయన్ డాలర్లకు పెరిగిందని విశ్లేషకుల అంచనా.

Telugu Google Cloud, Keralathomas, Oraclelarry, Keralaborn, Thomaskurian-Telugu

కేరళలలో జన్మించారు థామస్ కురియన్ .ఆయన సోదరుడు జార్జ్ కూడా మరో టెక్ కంపెనీ నెట్ యాప్‌కు సీఈవోగా వ్యవహరిస్తుండటం విశేషం.కాలేజ్ చదువును పూర్తి చేసుకున్న కురియన్ కన్సల్టింగ్ సంస్థ మెకిన్సే అండ్ కోలో నాలుగేళ్లు పనిచేశారు.తర్వాత ఒరాకిల్‌లో స్థిరపడ్డారు.22 ఏళ్లు ఆ సంస్థలో పనిచేసిన కురియన్‌ ప్రొడక్ట్ ప్రెసిడెంట్‌గా ఒరాకిల్ క్లౌడ్ కంప్యూటింగ్ సాఫ్ట్‌వేర్‌ను అభివృద్ధి చేసే గ్రూపులను పర్యవేక్షించారు.ఈ రంగంలో ప్రత్యర్థులుగా వున్న అమెజాన్ వెబ్ సర్వీసెస్, మైక్రోసాఫ్ట్ అజూర్, గూగుల్ క్లౌడ్‌లను ఎదుర్కోవడానికి టెక్నాలజీని మరింత ఆధునీకరించారు.

Telugu Google Cloud, Keralathomas, Oraclelarry, Keralaborn, Thomaskurian-Telugu

కాగా కురియన్, ఒరాకిల్ సహ వ్యవస్థాపకుడు ఎల్లిసన్‌లు కంపెనీ క్లౌడ్ స్ట్రాటజీపై ఓ రోజున గొడవ పడ్డారు.ఈ సమయంలో ఎల్లిసన్ విధానాలు నచ్చకపోవడంతో 2018 సెప్టెంబర్‌లో ఒరాకిల్‌కు రాజీనామా చేశారు.అనంతరం ఆయన గూగుల్‌లో చేరారు.ఇక్కడికి వచ్చిన తొలి నాళ్లలోనే.గూగుల్‌ను వదిలి వెళ్లిపోయిన వారి స్థానాల్లో పేరున్న ఎగ్జిక్యూటివ్‌లను నియమించారు.శాప్ నుంచి గూగుల్ రావడానికి తటపటాయిస్తున్న పలువురికి ఆకర్షణీయమైన వేతనాలను ఎరగా వేశారు.

ఈ నిర్ణయం తర్వాతి రోజుల్లో గూగుల్‌ క్లౌడ్ విస్తరణకు దోహదపడింది.క్లయింట్ సర్వీస్‌పై దృష్టి పెట్టిన కురియన్.

పలు సంస్థలతో కీలక ఒప్పందాలు చేసుకున్నారు.సేల్స్ ఎగ్జిక్యూటివ్‌ల కోసం గూగుల్ ఆకర్షణీయమైన వేతనాలను అందిస్తోంది.

అనుభవజ్ఞులైన సేల్స్ ఎగ్జిక్యూటివ్‌లు వేతనం, కమీషన్‌తో కలిపి ఏడాదికి 6,00,000 డాలర్ల నుంచి 7,00,000 డాలర్ల వరకు అందుకుంటున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube