వేలానికి ట్రంప్ కారు.. ఎంతైనా కొనేస్తానంటున్న భారతీయుడు..!!!  

డొనాల్డ్ ట్రంప్… పరిచయం పెద్ద అక్కర్లేదు.అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించడానికి ముందు, బడా వ్యాపారవేత్త.

TeluguStop.com - Kerala Based Jeweller Boby Chemmanur To Bid For Donald Trumps Used Rolls Royce Phantom

పుట్టుకతో శ్రీమంతుడు.తండ్రి ఇచ్చిన ఆస్తిని తన తెలివితేటలతో పదింతలు చేశాడు.

ఎన్నో వ్యాపార సంస్థలు, వేల కోట్ల సంపదతో అమెరికాలోని సంపన్నుల్లో ఒకడిగా నిలిచిన వ్యక్తి.అలాంటి ట్రంప్‌ తన కారును వేలానికి పెట్టాడన్న వార్త అక్కడి రాజకీయ వర్గాలతో పాటు కార్పోరేట్ ప్రపంచాన్ని సైతం ఉలిక్కిపడేలా చేసింది.

TeluguStop.com - వేలానికి ట్రంప్ కారు.. ఎంతైనా కొనేస్తానంటున్న భారతీయుడు..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image

దీనికి కారణాలు లేకపోలేదు.కోవిడ్ కారణంగా ట్రంప్ సంపద దాదాపు రూ.7,400 కోట్లు కరిగిపోయిందని లెక్కలున్నాయి.ట్రంప్‌ కుటుంబ వ్యాపార సంస్థ ట్రంప్ ఆర్గనైజేషన్‌కు చెందిన చాలా హోటళ్లు దివాళా తీసే పరిస్థితిలో ఉన్నాయట.

అంతేకాదు.పీకల్లోతు అప్పులున్నాయని ప్రముఖ మీడియా సంస్థలు కథనాలు వెలువరిస్తున్నాయి.

రాబోయే కొన్నేళ్లలో ట్రంప్ దాదాపు మూడు వేల కోట్ల రూపాయల మేర రుణాలు చెల్లించాల్సి ఉంటుందని న్యూయార్క్ టైమ్స్ పత్రిక ఒక కథనం ప్రచురించింది.నిజానికి తన ఆస్తులతో పోల్చితే, ఇది చిన్న మొత్తమే కావొచ్చు.

కానీ కంపెనీలు దివాళా నుంచి తప్పించుకునే పరిస్థితి మాత్రం లేనట్లు తెలుస్తోంది.ఈ నెల 20న అధ్యక్ష పదవి నుంచి దిగిపోయాక ట్రంప్ మళ్లీ తన వ్యాపారాల విస్తరణపై దృష్టి పెట్టచ్చని భావిస్తున్నారు.

కానీ క్యాపిటల్ భవంతిపై దాడి కేసులోగానీ, అంతకుముందున్న ఆరోపణల్లో గానీ ఏ ఒక్కటి రుజువైనా న్యాయపరమైన చిక్కులు తప్పవనే వాదన వినిపిస్తోంది.డబ్బుల కోసమో, లేక మరేదైనా కారణమో గానీ ట్రంప్ తాను అధ్యక్షుడు కాకముదు వాడిన విలాసవంతమైన కారుని వేలానికి పెట్టారు.

ఇది అతి ఖరీదైన రోల్స్ రాయిస్ ఫాంటమ్ కారు.ప్రపంచంలోని అతి పెద్ద కార్ల వేలం సంస్థల్లో ఒకటైన అమెరికన్ బిడ్డింగ్ వెబ్ సైట్మెకం ఆక్షన్స్‘ దీనిని వేలానికి ఉంచింది.ఇది.2010లో రోల్స్ రాయిస్ ఉత్పత్తి చేసిన 537 స్పెషల్ ఎడిషన్ కార్లలో ఒకటి.దీనిపై ట్రంప్ ఇప్ప‌టికే 91,249 కిలోమీట‌ర్లు ప్ర‌యాణించారు.అగ్రరాజ్యాధినేత వాడిన కారు కావడంతో సహజంగానే క్రేజ్ భారీగానే వుంటుందని భావిస్తున్నారు.అందువల్ల వేలంలో బాగానే గిట్టుబాటయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ఈ నేపథ్యంలో ఈ కారును సొంతం చేసుకుంటానంటున్నారు కేరళకు చెందిన అభరణాల వ్యాపారి బాబీ చెమ్మూర్.

ఆభరణాల వ్యాపారంలో బాబీ చెమ్మూర్‌ది అందెవేసిన చేయి.భారత్ సహా డజనుకు పైగా దేశాల్లో ఆయన వ్యాపార సామ్రాజ్యం విస్తరించి ఉంది.

అమెరికాలోని టెక్సాస్ లోనూ ఓ బ్రాంచ్ ఉంది.అంతర్జాతీయ సెలబ్రిటీలతోనూ చెమ్మూర్‌కు పరిచయాలు వున్నాయి.

గతంలో తన జ్యూవెలరీ షోరూమ్‌ని ప్రారంభించేందుకు లెజండరీ ఫుట్‌బాల్ క్రీడాకారుడు డీగో మారడోనాను కేరళకు రప్పించారు.తాజాగా ఇప్పుడు ట్రంప్ వాడిన లగ్జరీ కారును కొనేందుకు బిడ్ లో పాల్గొంటానని చెప్పడంతో ఆయన వార్తల్లో ఒకరిగా నిలిచారు.

మరి ట్రంప్ కారును సొంతం చేసుకునే అదృష్టం ఎవరికి దక్కుతుందో వేచి చూడాలి.

.

#Kovid #NewYork #Donald Trump #AttackOn #AmericanBidding

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు