నాగార్జున చేతుల మీదుగా ద‌ర్శ‌కేంద్రుడు కె.రాఘ‌వేంద్రరావు ‘పెళ్లి సంద‌D’ టీజర్ విడుదల

ద‌ర్శ‌కేంద్రుడు కె.రాఘ‌వేంద్ర‌రావు ద‌ర్శ‌క‌త్వ ప‌ర్య‌వేక్ష‌ణ‌లో రూపొందుతున్న‌ చిత్రం ‘పెళ్లి సంద‌D’తో మ‌రోసారి మ్యాజిక్‌ను రిపీట్ చేయ‌డానికి సిద్ధ‌మ‌య్యారు.

 Keraghavendraravu Darsakendrudu From The Hands Of Nagarjuna Marriage During The D Teaser Released-TeluguStop.com

ఈ సినిమాతో ఆయ‌న న‌టుడిగా కూడా ఎంట్రీ ఇస్తుండ‌టం విశేషం.ఈ బ్యూటీఫుల్ ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్‌ను ఆయ‌న శిష్యురాలు గౌరి రోణంకి డైరెక్ట్ చేస్తున్నారు.

ఆర్కా మీడియా వ‌ర్క్స్‌, ఆర్‌.కె ఫిలిం అసోసియేట్స్ బ్యాన‌ర్స్‌పై కె.కృష్ణ మోహ‌న్ రావు స‌మ‌ర్ప‌ణ‌లో మాధవి కోవెలమూడి, శోభు యార్లగడ్డ, ప్రసాద్‌ దేవినేని ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

 Keraghavendraravu Darsakendrudu From The Hands Of Nagarjuna Marriage During The D Teaser Released-నాగార్జున చేతుల మీదుగా ద‌ర్శ‌కేంద్రుడు కె.రాఘ‌వేంద్రరావు ‘పెళ్లి సంద‌D’ టీజర్ విడుదల-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ద‌ర్శ‌కేంద్రుడు తెర‌కెక్కించిన నాటి బ్లాక్‌బ‌స్ట‌ర్‌ `పెళ్లిసంద‌డి`లో శ్రీ‌కాంత్ హీరో అయితే నేడు ఆయ‌న ద‌ర్శ‌క‌త్వ పర్య‌వేక్ష‌ణ‌లో గౌరి రోణంకి డైరెక్ట్ చేస్తున్న పెళ్లిసంద‌D లో శ్రీ‌కాంత్ త‌న‌యుడు రోష‌న్ హీరో అవ‌డం విశేషం.

శ్రీలీల హీరోయిన్‌.మంగ‌ళ‌వారం ‘పెళ్లి సంద‌D’ టీజ‌ర్‌ను కింగ్ నాగార్జున విడుద‌ల చేశారు.‘పెళ్లి సంద‌D’ మూవీ చాలా పెద్ద హిట్ కావాలంటూ చిత్ర యూనిట్‌కు అభినంద‌న‌లు తెలిపారు.

హీరో రోష‌న్ స్టైలిష్ లుక్‌తో క్యారెక్ట‌రైజేష‌న్ ఎలా ఉండ‌బోతుంద‌నే విష‌యాన్ని సింపుల్‌గా చెప్పారు.అలాగే లంగా ఓణిలో హీరోయిన్ శ్రీలీలను అందంగా ప్రెజెంట్ చేశారు.హీరో, హీరోయిన్ మ‌ధ్య రొమాంటిక్ స‌న్నివేశాల‌ను చూపించారు.

మ‌రో వైపు ‘స‌హ‌స్త్ర‌కు పెళ్లి నాతోనా లేక నువ్వు తెచ్చి తొట్టి గ్యాంగ్ లీడ‌ర్‌తోనా’ అని హీరో రోషన్, హీరోయిన్ తండ్రి ప్రకాశ్‌రాజ్‌తో ఛాలెంజ్ చేసే సీన్‌తో సినిమాలో కేవ‌లం ప్రేమ స‌న్నివేశాలే కాకుండా నువ్వా నేనా అనేలా హీరోకి, హీరోయిన్ తండ్రికి మ‌ధ్య స‌న్నివేశాలుంటాయ‌ని అర్థ‌మవుతుంది.యాక్ష‌న్ స‌న్నివేశాలు, పెళ్లిలో హీరో, హీరోయిన్ స‌హా పెళ్లి బృంద‌మంతా క‌లిసి చేసే హ‌డావుడి, హీరో హీరోయిన్ మ‌ధ్య రొమాంటిక్ స‌న్నివేశాలు, క‌మ‌ర్షియ‌ల్ సాంగ్‌, ఎమోష‌న‌ల్ స‌న్నివేశాల‌ను చూపించారు.

పెళ్లి భోజ‌నం ఎంత చ‌క్క‌గా ఉంటుందో అంతే చ‌క్క‌గా మా ‘పెళ్లి సంద‌D’ సినిమా ఉంటుంద‌నేలా టీజ‌ర్ ఉంది.

ఇప్ప‌టికే సినిమా ప్ర‌మోష‌న్స్ స్టార్ట్ చేశాం.ఈ సినిమా నుంచి విడుద‌లైన రాఘవేంద్ర‌రావు ప్రోమో, హీరో, హీరోయిన్ ప్రోమోలు, సాంగ్స్ అన్నింటికీ ప్రేక్ష‌కుల నుంచి సూప‌ర్బ్ రెస్పాన్స్ వ‌చ్చింది.నిర్మాణానంతర కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి.త్వరలోనే సినిమా విడుదల గురించి తెలియజేస్తాం’’ అని డైరెక్టర్ గౌరి రోణంకి తెలిపారు.

నటీనటులు:

రోష‌న్, శ్రీ‌లీల, ప్ర‌కాశ్‌రాజ్‌, రాజేంద్ర ప్ర‌సాద్‌, రావు ర‌మేష్‌, త‌నికెళ్ల భ‌ర‌ణి, పోసాని కృష్ణ ముర‌ళి, వెన్నెల కిషోర్‌, స‌త్యంరాజేష్‌, రాజీవ్ క‌నకాల‌, శ్రీ‌నివాస్ రెడ్డి, శక‌లక శంక‌ర్‌, అన్న‌పూర్ణ‌, జాన్సి, ప్ర‌గ‌తి, హేమ‌, కౌముది, భ‌ద్రం, కిరీటి త‌దిత‌రులు.

సాంకేతిక వ‌ర్గం:

సంగీతం: ఎం.ఎం.కీర‌వాణి సాహిత్యం: శివ‌శ‌క్తి ద‌త్త‌, చంద్ర‌బోస్సి నిమాటోగ్ర‌ఫి: సునీల్ కుమార్ నామ ఎడిట‌ర్‌: త‌మ్మిరాజుఆర్ట్‌: కిర‌ణ్ కుమార్ మ‌న్నె,‌ మాట‌లు: శ్రీ‌ధ‌ర్ సీపాన‌ఫైట్స్‌: వెంక‌ట్కొరియోగ్ర‌ఫి: శేఖ‌ర్ వీజే ప్రొడ‌క్ష‌న్ ఎగ్జిక్యూటివ్‌: వి.మోహ‌న్ రావు,ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్‌:సాయిబాబా కోవెల‌మూడి స‌మ‌ర్ప‌ణ‌: కె.కృష్ణ‌మోహ‌న్ రావు‌నిర్మాత‌లు: మాధ‌వి కోవెల‌మూడి, శోభు యార్ల‌గడ్డ‌, ప్ర‌సాద్ దేవినేని ద‌ర్శ‌క‌త్వ ప‌ర్య‌వేక్ష‌ణ‌: కె.రాఘ‌వేంద్ర‌రావు బి.ఎద‌ర్శ‌క‌త్వం: గౌరీ రోణంకి.

#Srilila #Kiravani #Prakash Raj #Hiro Roshan #Raghvedra Rao

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు