కన్నీళ్లు పెట్టించే ఘటన.. ఆకలితో ఏడుస్తున్న పిల్లల కోసం!?

లాక్ డౌన్ అనేది అందరికి ఒకేలా ఉండదు.అందరూ మిడిల్ క్లాస్.

 Kenya, Food Problem,children,lockdown, Corona Effect-TeluguStop.com

హై క్లాస్ ఉండరు కదా! కష్టాలు ఉన్నవారు ఉంటారు.లేని వారు ఉంటారు.

కట్టే కష్టపడితే కానీ పొట్ట గడవదు.అలాంటి వాళ్ళు ఈ లాక్ డౌన్ సమయంలో ఏం చేస్తారు.

ఇంట్లో ఉంటే పూట గడవదు.బయటకు వెళ్తే కరోనా భయం.ఇంకా అలాంటి వాళ్ళకు ఒక పూట అయినా తిండి దొరకడమే గగనం.

ఇంకా ఈ నేపథ్యంలోనే ప్రతిఒక్కరి కంట కన్నీళ్లు పెట్టించే ఘటన కెన్యాలో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళ్తే.కెన్యా దేశానికి చెందిన ఓ మహిళకు ఏకంగా 8 మంది పిల్లలు ఉన్నారు.

ఇంకా ఆమె భర్త గత ఏడాది ఓ దొంగ చేతిలో హత్యకు గురయ్యాడు.దీంతో ఆ మహిళా పెద్ద ఇళ్లలో పని చేసి ఆ 8 మంది పిల్లలను పోషించేది.

అయితే ఇప్పుడు లాక్ డౌన్ తో ఎక్కడ పని లేదు.ఇంట్లో చూస్తే ఏమి లేవు.పిల్లలు ఆకలి అని ఏడుస్తున్నారు.ఎం చెయ్యాలో తోచని ఆ మహిళా ఓ గిన్నెలో నీళ్లు తీసుకొని అందులో రాళ్లు పెట్టి ఉడకబెట్టింది.

అలా అయినా పిల్లలు అమ్మ వంట చేస్తుంది అని ఏడుపు ఆపుతారు అని అనుకుంది.కానీ పిల్లలు ఇంకా ఎక్కువ ఏడవడం మొదలు పెట్టారు.

దీంతో ఆ పిల్లల ఏడుపు విన్న పక్కింటి వ్యక్తి వచ్చి చూడగా అక్కడ పరిస్థితి అర్థం అయ్యింది.దీంతో ఆ దారుణ పరిస్థిని స్థానిక మీడియా ముందు తీసుకొచ్చాడు.

ఇంకా అంతే.ఆ పరిస్థితి చుసిన కెన్యా ప్రజలు ఆమె బ్యాంకు ఖాతాలో డబ్బు జమ చేశారు.

ఇలా ఆమెను ఆ దేశ ప్రజలు ఆదుకున్నరు.చూశారు కదా! ఈ తల్లి బిడ్డలకు అయితే ప్రస్తుతం కడుపు నిండా అన్నం దొరికింది.

కానీ ఇలాంటి కుటుంబాలు ఎన్నో మన చుట్టుపక్కల ఉంటాయి.వారందిరికి ఈ కష్టకాలంలో కాస్త అయినా సహాయం చేద్దాం.

కొందరి కడుపులు అయినా నింపుదాం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube