భారత్ కి క్షమాపణలు చెప్పిన అగ్ర రాజ్యం..ఎందుకంటే..!!!  

Ken Juster Sorry Indians Gandhi Statue - Telugu George Floyd Death, Ken Juster, Mahatma Gandhi Statue, Protesters, Tweets, Twitter

అమెరికాలో ప్రస్తుతం జార్జ్ ఫ్లాయిడ్ మృతి ఘటన సంచలనం సృష్టిస్తున్న విషయం అమెరికి తెలిసిందే.ఈ సంఘటనపై ప్రపంచ దేశాలలో ఉన్న వివిధ మానవ హక్కుల సంఘాలు.

 Ken Juster Sorry Indians Gandhi Statue

ప్రజలు సైతం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.అమెరికా తప్పకుండా జార్జ్ కుటుంభానికి న్యాయం చేయాలని.

అతడి మృతికి కారణమైన పోలీసు అధికార్ని శిక్షించాలని పట్టుబడుతున్నారు.అమెరికాలో నల్ల జాతీయులు దాడులతో కూడిన నిరసనలు తెలుపుతూ ఆందోళన చేస్తున్నారు.

భారత్ కి క్షమాపణలు చెప్పిన అగ్ర రాజ్యం..ఎందుకంటే..-Telugu NRI-Telugu Tollywood Photo Image

ఎన్నో హోటల్స్, మాల్స్ పై దాడులు చేస్తూ ద్వంసం చేస్తున్నారు.

ఈ క్రమంలోనే వాషింగ్టన్ లో ఉన్న ఇండియన్ ఎంబసీ కార్యాలయంలో బయట ఉండే గాంధీ విగ్రహాన్ని ధ్వంసం చేశారు.

దాంతో అమెరికాలో ఉన్న భారతీయులకి ఈ ఘటన తీవ్ర కోపాన్ని కలిగించింది.గాంధీ విగ్రహాన్ని ధ్వంసం చేయడానికి మీ నిరసనలకి సంభంధం ఏమిటి అంటూ సోషల్ మీడియాలో భారతీయులు నల్ల జాతీయులని ప్రసిస్తున్నారు.

జార్జ్ కి జరిగిన అన్యానికి మేము మద్దతు తెలిపాము కానీ మీరు గాంధీ విగ్రహాన్ని ధ్వంసం చేయడంతో చేయరాని తప్పు చేశారని ప్రతీ భారతీయుడికి జరిగిన అవమానంగా మేము భావిస్తున్నాం అంటూ మండిపడుతున్నారు.

ఈ ఘటనపై మా మనోభావాలు దెబ్బతిన్నాయి.వెంటనే ఈ సంఘటనపై పూర్తి స్థాయి విచారణ జరిపి నిందితులని పట్టుకుని శిక్షించాలని పోలీసులకి విజ్ఞప్తి చేశారు.దాంతో స్పందించిన వాషింగ్టన్ పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేస్తున్నారు.

ప్రస్తుతానికి విగ్రహాని కవర్ తో కప్పి ఉంచారు.ఈ ఘటనని ఖండించిన అమెరికా ప్రభుత్వం భారత దేశానికి క్షమాపణలు చెప్పింది.

తమ క్షమాపణలకు మీరు ఆమోదం తెలిపాలంటూ అమెరికా అంబాసిడర్ కెన్ జస్టర్ ట్వీట్ చేశారు.

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Ken Juster Sorry Indians Gandhi Statue Related Telugu News,Photos/Pics,Images..

footer-test