ఆ రోజే కలిసొస్తుందా కేజ్రీ కి, ఈ సారి కూడా

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ హ్యాట్రిక్ విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే.మొత్తం 70 స్థానాలకు జరిగిన ఎన్నికల్లో అనూహ్యంగా 62 స్థానాల్లో విజయ కేతనాన్ని ఎగురవేసి మరోసారి ఢిల్లీ పీఠాన్ని ఆప్ తన సొంతం చేసుకుంది.

 Kejriwal Will Take Oath As Delhi Cm On Valentines Day-TeluguStop.com

అయితే ఇక్కడ మరో అనూహ్యమైన విషయం ఏమిటంటే ఢిల్లీ సీఎం గా అరవింద్ కేజ్రీవాల్ ప్రేమికుల రోజు అయిన ఫిబ్రవరి 14 న ప్రమాణ స్వీకారం చేయనున్నారు.అయితే గత ఎన్నికల సమయంలో కూడా ఆప్ గెలిచినప్పుడు కేజ్రీ ఇదే ప్రేమికుల రోజు ప్రమాణ స్వీకారం చేయడం విశేషం.ఆమ్ ఆద్మీ పార్టీ 2012లో ఏర్పాటైన తర్వాత మరుసటి సంవత్సరం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి కంటే తక్కువ స్థానాలు వచ్చినప్పటికీ.2013 డిసెంబర్ లో కాంగ్రెస్ తో కలిసి ఆప్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది.అనంతరం కొన్ని రోజులకే కాంగ్రెస్ తో తలెత్తిన విభేదాలతో సీఎం పదవికి 2014 ఫిబ్రవరి 14న రాజీనామా చేసిన కేజ్రీ 2015 అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరిగానే బరిలోకి దిగారు.అయితే ఆ ఎన్నికల్లో ఆప్ పూర్తి మెజారిటీతో గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది.

ఈ క్రమంలోనే కేజ్రీ ఫిబ్రవరి 14 వ తేదీ అంటే ప్రేమికుల రోజునే ఆయన ఢిల్లీ సీఎం గా ప్రమాణస్వీకారం చేశారు.అయితే ఈ సారి కూడా ఆయన ప్రేమికులరోజు నే ఢిల్లీ సీఎం గా ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు సమాచారం.

ఢిల్లీలోని మొత్తం 70 స్థానాలకుగాను ఆప్‌ 62 స్థానాల్లో విజయదుందుభి మోగించగా, ఈసారి ఢిల్లీ పీఠం తమదేనని చెప్పిన కమలనాథులు కనీసం రెండంకెల స్థానాలను కూడా గెలుచుకోలేకపోవడం విశేషం.ఢిల్లీని వరుసగా 15ఏండ్ల పాటు (1998-2013) ఏలిన కాంగ్రెస్‌ ఈ ఎన్నికల్లో కూడా ఖాతాను తెరువలేకపోయింది.ఆప్‌కు 53.57%, బీజేపీకి 38.51%, కాంగ్రెస్‌కు 4.26 శాతం ఓట్లు వచ్చాయి.దేశంలో కొత్త తరహా రాజకీయాలు పురుడుపోసుకున్నాయని, ఇవి అభివృద్ధి రాజకీయాలని ఆప్‌ అధినేత, ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ వ్యాఖ్యానించారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube