కరోనా వారియర్లకు కేజ్రీవాల్ ఆసరా.. మీరు గ్రేట్ సార్.. !

ప్రపంచంలో కరోనా వ్యాప్తి జరుగుతున్న సమయంలో ప్రజలకు సేవలందించిన వ్యక్తులకు కరోనా వారియర్లు అని పేరు పెట్టారు.కానీ కరోనా తగ్గుముఖం పట్టగానే వీరి ఊసే మరచిపోయారు.

 Kejriwal Supports Corona Warriors-TeluguStop.com

అప్పుడు దేవుళ్లుగా కనిపించిన కరోనా వారియర్లు ప్రస్తుతం కష్టాలు ఎదుర్కొంటున్నారు.

వీరిని ప్రభుత్వాలైతే పట్టించుకోవడం లేదన్న విషయం ప్రచారం జరుగుతున్నట్లు తెలిసిందే.

 Kejriwal Supports Corona Warriors-కరోనా వారియర్లకు కేజ్రీవాల్ ఆసరా.. మీరు గ్రేట్ సార్.. -Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఈ క్రమంలో కరోనా వారియర్ల కుటుంబాలకు ఢిల్లీ ప్రభుత్వం బాసటగా నిలిచింది.విధి నిర్వహణలో వైరస్ బారిన పడి మృతి చెందిన నర్సులు, ల్యాబ్ టెక్నిషన్లు, వైద్య సిబ్బంది కుటుంబాలకు రూ.1కోటి ఎక్స్‌గ్రేషియా చెల్లించనున్నట్లు ప్రకటించింది.ఇందులో భాగంగా ల్యాబ్ టెక్నిషియన్ రాకేష్ జైన్ ఫ్యామిలీకి శనివారం రూ.కోటి చెక్కు అందజేశారు అధికారులు.

ఇక మృతుడు రాకేష్ జైన్ ఢిల్లీలోని హిందురావ్ హాస్పిటల్‌లో కరోనా వారియర్‌గా విధులు నిర్వర్తిస్తూ వైరస్ బారిన పడి తనువు చాలించాడు.

ఇకపోతే ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి సృష్టించిన బీభత్సం ఇంకా మరపురావడం లేదు.ఈ మహమ్మారి నుంచి బాధితులను రక్షించే క్రమంలో క్వారంటైన్‌లో ఉన్న రోగులకు చికిత్స అందిస్తూ, వైరస్ బారిన పడి చాలా మంది కరోనా వారియర్లు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే.

#New Dwlhi #Support #Kejriwal #Corona Warriors

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు