కేజ్రీవాల్ లవ్ స్టోరీ... సినిమా స్టోరీ కంటే గొప్పగా ఉందే... !

దేశవ్యాప్తంగా ఢిల్లీ సీఎంగా మూడోసారి ప్రమాణస్వీకారం చేసిన అరవింద్ కేజ్రీవాల్ పేరు మారుమ్రోగుతోంది.అరవింద్ కేజ్రీవాల్ కు సంబంధించిన కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.

 Kejriwal Real Love Story-TeluguStop.com

ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ది ప్రేమ వివాహమని సినిమాల్లో హీరోలా నిజ జీవితంలో కష్టపడి కేజ్రీవాల్ తన ప్రేమలో విజయం సాధించాడని కేజ్రీవాల్ ప్రేమకథ వైరల్ అవుతోంది.కేజ్రీవాల్ గొప్ప నాయకుడే కాదు గొప్ప ప్రేమికుడు కూడా అని కేజ్రీవాల్ ప్రేమకథ గురించి నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

కేజ్రీవాల్ రాజకీయాల్లోకి రాకముందు సివిల్స్ పరీక్షలు రాసి ఐ.ఆర్.ఎస్.కు ఎంపికయ్యారు.కేజ్రీవాల్ ఐ.ఆర్.ఎస్ పరీక్ష కోసం నాగ్ పూర్ లో శిక్షణ తీసుకున్నారు.అదే సమయంలో సునీత అనే యువతిని కేజ్రీవాల్ కలిశారు.

కేజ్రీవాల్ సంకల్పం, ఆశయాలు నచ్చటంతో సునీత కేజ్రీవాల్ ను ప్రేమించారు.కేజ్రీవాల్ కూడా సునీతను ఇష్టపడ్డారు.

కానీ ఒకరినొకరు ప్రేమించుకున్నా చాలా నెలల పాటు ఆ ప్రేమను వ్యక్తపరచుకోలేదు.

సునీత కుటుంబం ఢిల్లీలో నివశిస్తుండగా కేజ్రీవాల్ కుటుంబం హర్యానాలో నివశిస్తూ ఉండేది.

మొదట ఇరు కుటుంబాల పెద్దలు వీరి పెళ్లికి అంగీకరించకపోయినా వారిని ఒప్పించి 1994 నవంబర్ లో పెద్దల సమక్షంలో ఒక్కటయ్యారు.దేశానికి సేవ చేయాలని కేజ్రీవాల్ తన ఉద్యోగానికి రాజీనామా చేసినా సునీత కేజ్రీవాల్ కు ఎల్లప్పుడూ అండగా నిలిచింది.

కేజ్రీవాల్ విజయంలో ఎల్లప్పుడూ తోడుగా సహకారం అందిస్తూ ప్రతి మగాడి విజయం వెనుక ఒక మహిళ ఉంటుందని సునీత నిరూపించింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube