ఆ రాష్ట్రంలో మద్యం ప్రియులకు మరో గుడ్ న్యూస్ ...!

ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి ఎన్నో ఇబ్బందులకు గురి చేస్తున్న సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.ఇకపోతే భారతదేశంలో కూడా రోజురోజుకీ కరోనా మహమ్మారి విజృంభన సంగతి అందరికీ విదితమే.

 Alcohol,lockdown Eases,alcohol Prices,delhi Government Removes 70% Corona Fee,k-TeluguStop.com

దీనితో ప్రస్తుతం దేశం మొత్తం 5 వ సారి లాక్ డౌన్ కొనసాగిస్తున్న సంగతి అందరికీ విదితమే.అయితే ప్రస్తుత లాక్ డౌన్ మొదలైనప్పటి నుంచి కేంద్ర ప్రభుత్వం అనేక సడలింపులు ఇచ్చిన సంగతి అందరికీ తెలిసిందే.

ఇక ఈ నేపథ్యంలో క్రేజివాల్ సర్కారు ఆ రాష్ట్ర మందు ప్రియులకు శుభవార్త తెలియజేసింది.అయితే లాక్ డౌన్ ఎత్తివేత సమయంలో మద్యం పై విధించిన కరోనా స్పెషల్ ఫీజును ఉపసంహరిస్తూ ఆ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

ఇకపోతే ఈ నిర్ణయం ఈ నెల పదవ తారీకు నుంచి అమల్లోకి రానుంది.గత నెలలో ఢిల్లీలో మద్యంపై ఏకంగా 70 శాతం కరోనా స్పెషల్ ఫీజును విధించిన అధికారులు మొదట్లో మద్యం అమ్మకాలు పెద్ద ఎత్తున జరిగిన… ఆ తర్వాత పూర్తిగా పడిపోయాయి.

దీనితో ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం కరోనా స్పెషల్ ఫీజును పూర్తిగా ఎట్టి వేసింది.అయితే మద్యం పై ఉన్న 20 శాతం వ్యాట్ ను కాస్త 25 శాతానికి పెంచేసింది.

ఇకపోతే తాజాగా ఢిల్లీ రాష్ట్రంలో కరోనా బారిన పడిన కేసుల సంఖ్య 27654 కు చేరుకుంది.ఇక ఇప్పటివరకు 761 మంది ఆ రాష్ట్రంలో మరణించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube