బాబు అంటించి వదిలేస్తే..క్రేజీవాల్ తగలేట్టేస్తున్నాడు

భారత ప్రధాని మోడీ నియంతృత్వ పోకడలకి.మోడీ అణిచివేత ధోరణికి దేశంలో ఎన్నో రాష్ట్రాల నేతలు అనేక సందర్భాలలో మోడీ పై తమ గళాన్ని వినిపించారు.

 Kejriwal Fire On Modi-TeluguStop.com

మోడీ ఒక గొప్ప ప్రధాని అనే ముసుగు లోపల ఉండే మరో మోడీ ఎవరికీ కనపడడు.మోడీ కి వ్యతిరేకంగా గళం విప్పే వారికి మాత్రమే అసలు మోడీ కనిపిస్తాడు.

ఈ వ్యాఖ్యలు భాదిత నేతలు ఎన్నో సందర్భాలలో చేశారు కూడా అయితే జాతీయ మీడియాని మేనేజ్ చేసుకోగల మోడీ దేశ ప్రజలకి ఎంతో సౌమ్యుడిగానే కనిపిస్తాడు.అయితే 2014 ఎన్నికలు జరిగిన తరువాత మోడీ అధికారంలోకి వచ్చిన తరువాత ఢిల్లీ లో తరువాత ఏడాది ఎన్నికలు జరిగాయి.ఈ ఎన్నికల్లో

క్రేజీవాల్ భారీ మెజారిటీతో ఒక్కసారిగా ఢిల్లీ ఫీటాని తన హస్తగతం చేసుకున్నాడు సీఎం గా ప్రమాణ స్వీకారం చేసిన క్రేజీవాల్.తరువాత తన ఆమాద్మీ పార్టీని విస్తరించాలని అనుకున్న సమయంలో మోడీ కి వెన్నులో వణుకు మొదలయ్యింది దాంతో మోడీ పై ఉక్కుపాదం మోపేసాడు.క్రేజీవాల్ శక్తీ మోడీ ని ఎదుర్కోవడానికి సరిపోలేదు.అంతేకాదు ఎన్ని అక్రమ కేసులు బనాయించారు.అయితే కొంతకాలం క్రేజీ సైలెంట్ అయిపోయారు.మోడీ నియంత పాలనకి మొదటి నిదర్శనం క్రేజీ వాల్ అని చేపచ్చు అయితే ఎప్పుడైతే చంద్రబాబు మోడీ పై తిరుగు బావుటా ఎగరేశాడో అప్పుడు అన్ని రాష్ట్రాల సీఎం లకి కొండంత బలం వచ్చినట్టు అయ్యింది.

ఇప్పుడు ఒక్కొక్కరుగా ఒక్కో రాష్ట్రం మోడీ పై పగ తీర్చుకున్తున్నాయి .అందులోనూ ఎన్నికలు దగ్గర పడుతున్న సమయం కూడా కావడంతో అందరూ ఒక్క తాటిపై ఉన్నారు ఎలా అయినా సరే మోడీ ని గద్దె దించాలి అనే ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు అయితే చంద్రబాబు తరువాత మళ్ళీ క్రేజీవాల్ మోడీ పై మరో సారి స్వరం పెంచారు.తన ఇంట్లో మీడియా సమావేశం ఏర్పాటు చేసి క్రేజీ వాల్ మోడీ ని ఒక ఆట ఆడుకున్నాడు.

మోడీ ప్రభుత్వం తమ మంత్రులపై 14 అవినీతి కేసులు బనాయించిందని,ఒక్కరిని కూడా దోషిగా తేల్చడం కానీ, అరెస్టు కానీ చేయలేదని అన్నారు.

కేజ్రీవాల్ ఏడాదిగా మౌనంగా ఉన్నారని ప్రజలు అనుకుంటున్నారు.అయితే నా మౌనాన్ని కేంద్రం అడ్వాంటేజ్‌గా తీసుకుంటోంది అని కేజ్రీవాల్ మండిపడ్డారు…తమ బంధువులకు అడ్వర్‌టైజ్‌మెంట్ కాంట్రాక్టులిచ్చారనే ఆరోపణలపై ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాపై ఓ కేసు పెట్టారు…మరి అదే అనుమతులు మనీష్ సిసోడియా ఇచ్చి ఉన్నారు అతడిని ఎందుకు లోపల వేయలేదు అని ప్రశ్నించారు క్రేజీవాల్…అయితే ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో ఒకరి తరువాత మరొక రాష్ట్ర సీఎం లు ఇలా మోడీ ని క్రేజీగా ఎండగట్టడం వెనుక పక్కా వ్యూహం ఉందని అంటున్నారు విశ్లేషకులు .

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube