బిగ్ బ్రేకింగ్: అవినీతి కేసులో చిక్కిన ఎమ్మార్వో ఆత్మహత్య

ఒక భూవివాదంలో కోటి పది లక్షల లంచం తీసుకొని ఏసీబీ అధికారులకి తెలంగాణలోని కీసర్ ఎమ్మార్వో నాగరాజు పట్టుబడిన సంగతి తెలిసిందే.తాజాగా అతను చంచల్ గూడా జైలులో ఆత్మహత్య చేసుకున్నాడు.

 Keesara Ex Mro Nagaraju Commits Suicide, Revenue Officer, Keesara Ex Mro, Acb-TeluguStop.com

ఎమ్మార్వో నాగరాజు వ్యవహారంలో రెండు తెలుగు రాష్ట్రాలలో సంచలనంగా మారింది.భారీగా లంచం తీసుకొని పట్టుబడ్డ నాగరాజుని కస్టడీలోకి తీసుకొని ఆయన ఇంట్లో ఏసీబీ సోదాలు నిర్వహించారు.

భారీ మొత్తంలో డబ్బులతో పాటు, ఆర్ధిక లావాదేవీలకి సంబంధించి పత్రాలు, ఇతర ఆస్తులని గుర్తించారు.అవినీతి తిమింగలంగా గుర్తించిన ఏసీబీ అధికారులు అతన్ని అరెస్ట్ చేసి చంచల్ గూడా జైలుకి తరలించారు.

ప్రస్తుతం ఈ కేసు విచారణ జరుగుతుంది.అవినీతి కేసులో పట్టుబడటంతో అతనిని ఉద్యోగం నుంచి తొలగించారు.ఒక్కసారిగా అతని భారీ అవినీతి భాగోతం బయటపడటంతో అతని వ్యవరాహాలపై మరింత దృష్టి సారించారు.

19 ఎకరాల 39 గుంటల భూమికి సంబంధించిన సమస్యను క్లియర్ చేయడానికి నాగరాజు లంచం డిమాండ్ చేశాడని తేలింది.దానికి సంబంధించిన కోటీ పది లక్షల డబ్బును లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఉప్పల్‌లోని చౌలా శ్రీనాథ్ యాదవ్, సత్య డెవలపర్ల నుంచి 2 కోట్లు డిమాండ్ చేసినట్లు ఏసీబీ విచారణలో స్పష్టమైంది.

భారీ మొత్తంలో డబ్బుతో పాటు, అనేక పత్రాలను ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.నాగరాజు కారులో 8 లక్షలు, అతని ఇంట్లో 28 లక్షల నగదును సీజ్ చేశారు.

లాకర్ కీ ఏసీబీ అధికారులకు దొరికాయి.అనేక స్థిరాస్తులు సోదాల్లో బయటపడ్డాయి.

లంచం తీసుకున్న నాగరాజు, వీఆర్ఏ సాయిరాజ్, లంచం ఇచ్చినందుకు చౌలా శ్రీనాథ్ యాదవ్‌‌తో పాటు మరో వ్యక్తిని ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు.విచారణ అనంతరం అధికారులు నాగరాజును చంచల్‌గూడ జైలుకు తరలించారు.

అక్కడే ఆయన ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డారు.అయితే జైలులో అతను ఎలా ఆత్మహత్య చేసుకున్నాడు అనేది ఇప్పుడు అనుమానాస్పదంగా మారింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube