కీర్తి సురేష్ గుడ్ లక్ సఖి కూడా ఒటీటీ బాటలోనే

మహానటితో టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అయిపోయిన అందాల భామ కీర్తి సురేష్.ఈ అమ్మడు ప్రస్తుతం సౌత్ లో క్రేజియస్ట్ హీరోయిన్ గా ఉండటంతో పాటు స్టార్ హీరోయిన్ గా కొనసాగుతుంది.గ్యాప్ లేకుండా బ్యాక్ టూ బ్యాక్ సినిమాలు చేస్తుంది.ప్రస్తుతం మహేష్ బాబుకి జోడీగా సర్కారు వారి పాట మూవీ చేస్తుంది.అలాగే మలయాళంలో మోహన్ లాల్ మరక్కర్ మూవీ రిలీజ్ కి రెడీ అవుతుంది.తమిళ్ లో మరోసారి విజయ్ కి జోడీగా జతకట్టబోతుంది.

 Keerthy Suresh's Good Luck Sakhi To Be Released On Zee5, Nagesh Kukumar, Tollywo-TeluguStop.com

అలాగే రజినీకాంత్ అన్నాత్తై మూవీలో కీలక పాత్రలో నటిసించింది.అలాగే తెలుగులో తేజ దర్శకత్వంలో గోపీచంద్ కోసం అలివేలు మంగగా మారబోతుంది.

మరో రెండు, మూడు ప్రాజెక్ట్ లు చర్చల దశలో ఉన్నాయి.ఇదిలా ఉంటే బాలీవుడ్ దర్శకుడు నగేష్ కుకుమార్ కీర్తి సురేష్ లీడ్ రోల్ లో చేసిన స్ట్రైట్ తెలుగు సినిమా గుడ్ లక్ సఖి.

స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో కామెడీ అండ్ ఎమోషనల్ ఎంటర్టైనర్ గా ఈ మూవీని తెరకెక్కించారు.
ఇప్పటికే షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ మూవీ ట్రైలర్ ని కూడా రిలీజ్ చేసి సినిమా మీద హైప్ క్రియేట్ చేశారు.

కచ్చితంగా ఈ మూవీతో కీర్తి సురేష్ ఖాతాలో మహానటి తర్వాత మరో మంచి హిట్ పడుతుందని అందరూ భావిస్తున్నారు.ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ మూవీ కూడా ఒటీటీ రిలీజ్ కి రెడీ అవుతుందని తెలుస్తుంది.

గత ఏడాది కీర్తి సురేష్ నటించిన పెంగ్విన్, మిస్ ఇండియా మూవీలు డైరెక్ట్ ఒటీటీలోనే రిలీజ్ అయ్యాయి.అయితే ఆ రెండు సినిమాలు డిజాస్టర్ టాక్ తెచ్చుకున్నాయి.

ఈ నేపధ్యంలో ఇప్పుడు గుడ్ లక్ సఖి కూడా ఒటీటీ రిలీజ్ కి రెడీ అవుతుండటంతో ఆ సెంటిమెంట్ రిపీట్ అవుతుందేమో అని కీర్తి సురేష్ అభిమానులు టెన్షన్ పడుతున్నారు.మరి దీనిపై దర్శక, నిర్మాతల నుంచి ఎలాంటి క్లారిటీ అయితే ఇప్పటి వరకు రాలేదు.

కాని జీ5 ఛానల్ ఈ మూవీ డిజిటల్ రిలీజ్ రైట్స్ ని సొంతం చేసుకుందని, త్వరలో విడుదల చేయడానికి రెడీ అవుతుందని ప్రచారం జరుగుతుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube