కాస్త జాగ్రత్తమ్మ కీర్తి?  

Keerthy Suresh Big Hopes On Bollywood -

గ్లామర్ గీతను దాటకుండానే అన్ని వర్గాల ఆడియెన్స్ ని ఎట్రాక్ట్ చేయడమంటే అంత సులువైన విషయం కాదు.కానీ మహానటి సినిమాతో ఒక్కసారిగా సౌత్ లో క్లిక్కయిన కీర్తి సురేష్ మాత్రం అదే తరహాలో క్రేజ్ అందుకుంటోంది.

Keerthy Suresh Big Hopes On Bollywood

అమ్మడు ఇంతవరకు గ్లామర్ డోస్ పెంచింది లేదు.స్టార్ హీరోలతో వరుస ఆఫర్స్ అందుకుంటోంది.

సర్కార్ సినిమా తరువాత బేబీ రెమ్యునరేషన్ కూడా పెంచేసింది.అయితే ప్రస్తుతం బాలీవుడ్ లో బోణి కపూర్ నిర్మిస్తున్న ఒక సినిమాలో నటిస్తోంది.అందుకోసం మహానటి బక్కచిక్కిపోయింది.పైగా సౌత్ లో కొన్ని పెద్ద ప్రాజెక్టులు కూడా వదులుకుందట.టాలీవుడ్ లో అయితే సీనియర్ హీరోల ఆఫర్స్ ను కూడా పట్టించుకోలేదట.

కాస్త జాగ్రత్తమ్మ కీర్తి-Movie-Telugu Tollywood Photo Image

బాలీవుడ్ లో ఒక్క ఆఫర్ రాగానే కీర్తి సురేష్ సౌత్ లో అనవసరంగా మంచి ఆఫర్స్ పోగొట్టుకుంటోంది అనే టాక్ వస్తోంది.ముఖ్యంగా కోలీవుడ్ లో అయితే కీర్తిపై అనేక కథనాలు వెలువడుతున్నాయి.గతంలో తెలుగులో సక్సెస్ అందుకొని బాలీవుడ్ లోకి వెళ్లిన హీరోయిన్స్ బాగానే క్లిక్కయ్యారు.

కానీ ఇలియానా లాంటి ముద్దుగుమ్మలు కాస్త తడబడాల్సి వచ్చింది.మరి కీర్తి అదృష్టం ఎంతవరకు వర్కౌట్ అవుతుందో చూడాలి.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Keerthy Suresh Big Hopes On Bollywood- Related....