మహేష్‌తో రొమాన్స్‌కు సై అంటోన్న మహానటి..?  

Keerthy Suresh To Romance Mahesh Babu - Telugu Keerthy Suresh, Mahesh Babu, Parasuram, Telugu Movie News

సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన రీసెంట్ మూవీ సరిలేరు నీకెవ్వరు ఎలాంటి విజయాన్ని అందుకుందో అందరికీ తెలిసిందే.ఈ సంవత్సరం అదిరిపోయే సక్సెస్‌తో ప్రారంభించిన మహేష్, తన నెక్ట్స్ మూవీని వెంటనే ప్రారంభించాలని ప్రయత్నించాడు.

 Keerthy Suresh To Romance Mahesh Babu - Telugu Keerthy Suresh, Mahesh Babu, Parasuram, Telugu Movie News-Gossips-Telugu Tollywood Photo Image

అయితే వంశీ పైడిపల్లి డైరెక్షన్‌లో రావాల్సిన సినిమా కొన్ని కారణాల వల్ల వాయిదా పడింది.

దీంతో తన నెక్ట్స్ మూవీని గీతా గోవిందం డైరెక్టర్ పరశురాం దర్శకత్వంలో మహేష్ తెరకెక్కించేందుకు సిద్ధమయ్యాడు.

మహేష్‌తో రొమాన్స్‌కు సై అంటోన్న మహానటి.. - Keerthy Suresh To Romance Mahesh Babu - Telugu Keerthy Suresh, Mahesh Babu, Parasuram, Telugu Movie News-Gossips-Telugu Tollywood Photo Image

కానీ ఈ సినిమాను ఎప్పుడు ప్రారంభిస్తారనే విషయంపై ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది.ఇక ఈ సినిమాలో నటీనటుల విషయంలో కూడా చిత్ర యూనిట్ తీవ్రంగా కష్టపడుతున్నారు.

ఈ సినిమాలో మహేష్ సరసన ఎవరిని హీరోయిన్‌గా తీసుకోవాలనే అంశంపై చిత్ర యూనిట్ చాలామందితో సంప్రదింపులు జరుపుతున్నారు.

కాగా ఈ సినిమాలో మహానటి హీరోయిన్ కీర్తి సురేష్ అయితే బాగుంటుందని చిత్ర దర్శకుడు పరుశారం భావిస్తున్నాడు.

దీని కోసం ఆమెను సంప్రదించినట్లు కూడా తెలుస్తోంది.గీతా ఆర్ట్స్ బ్యానర్‌పై ఈ సినిమాను అల్లు అరవింద ప్రొడ్యూస్ చేయనున్నాడు.

మరి ఈ సినిమాలో మహేష్ సరసన మహానటి బ్యూటీ నిజంగా నటిస్తుందా లేదా అనేది చూడాలి.

తాజా వార్తలు

Keerthy Suresh To Romance Mahesh Babu Related Telugu News,Photos/Pics,Images..