మహానటి కీర్తి సురేష్ ( Keerthy Suresh ) గురించి అందరికి తెలుసు.ఈమె నేను శైలజ సినిమాతో ఎంట్రీ ఇచ్చినప్పటికీ మహానటి సినిమా ద్వారానే స్టార్ డమ్ అందుకుంది.
మహానటి తర్వాత ఈమెకు బాగానే అవకాశాలు వచ్చిన పెద్దగా హిట్స్ అయితే రాకపోవడంతో వెనుకబడి పోయింది.కానీ మహేష్ బాబుతో ( Mahesh babu ) సర్కారు వారి పాట చేసి సూపర్ హిట్ అందుకుంది.
ఇక ఈ సినిమా తర్వాత మళ్ళీ ఈ అమ్మడు ఫామ్ లోకి వచ్చింది.తన విలక్షణ నటనతో మెప్పించిన ఈ బ్యూటీ సర్కారు వారి పాట( Sarkaru vaari paata) తర్వాత మళ్ళీ నానితో దసరా సినిమా చేసి బ్లాక్ బస్టర్ అందుకుంది.
ఇలా రెండు బ్లాక్ బస్టర్స్ తో అమ్మడు మరిన్ని అవకాశాలు అందుకుంటుంది.ప్రజెంట్ ఈమె చేతిలో అరడజను సినిమాలు ఉన్నాయి.తెలుగులో భోళా శంకర్ లో నటిస్తుంది.
ఈ సినిమాలో చిరంజీవి(Chiranjeevi ) చెల్లెలు పాత్రలో ఈమె నటిస్తుండగా ఆగస్టు 11న గ్రాండ్ రిలీజ్ కు రెడీ అవుతుంది.ఇక ఇది కాకుండా తమిళ్ లో వరుస సినిమాలను లైన్లో పెట్టుకుంది.మరి ఇప్పటి వరకు తెలుగు, తమిళ్ లో వరుసగా సినిమాలు చేసిన ఈ బ్యూటీ ఇప్పుడు బాలీవుడ్( Bollywood ) లోకి ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధం అవుతుంది అని టాక్.
బాలీవుడ్ లో కీర్తి సురేష్ డెబ్యూ మూవీ కోసం ఇప్పటికే సైన్ చేసిందట.బాలీవుడ్ యంగ్ హీరో వరుణ్ ధావన్ ( varun dhawan ) హీరోగా కీర్తి సురేష్ హీరోయిన్ గా ఒక సినిమా తెరకెక్కుతోందని తెలుస్తుంది.అది కూడా కోలీవుడ్ సూపర్ హిట్ సినిమా తేరి రీమేక్ అని తెలుస్తుంది.ఈ సినిమాను విజయ్ దళపతి ( vijay thalapathy ) హీరోగా చేయగా అట్లీ డైరెక్ట్ చేసాడు.
ఇక ఇప్పుడు హిందీలో అట్లీ ప్రొడ్యూస్ చేస్తాడని టాక్.ఇక డైరెక్టర్ ఎవరు అనేది తెలియాల్సి ఉంది.చూడాలి అమ్మడికి బాలీవుడ్ ఎంట్రీ ఎంత వరకు కలిసి వస్తుందో.