యాంకర్ మారనున్న కీర్తి సురేష్.. రెమ్యూనరేషన్ ఎంతంటే?

Keerthy Suresh To Became Anchor For A Popular Tv Channel

ప్రస్తుత కాలంలో వెండితెరపై సందడి చేస్తూ స్టార్ సెలబ్రెటీలు గా కొనసాగుతున్న ఎంతోమంది నటీనటులు బుల్లితెరపై పలు కార్యక్రమాలకు యాంకర్ గా వ్యవహరిస్తూ బుల్లితెర ప్రేక్షకులను సందడి చేస్తున్నారు.ఈ క్రమంలోనే ఎంతో మంది స్టార్ హీరో హీరోయిన్లు ఇప్పటికే బుల్లితెరపై పలు కార్యక్రమాలకు హోస్ట్ గా వ్యవహరిస్తూ తమదైన శైలిలో ప్రేక్షకులను చేయడమే కాకుండా సినిమాలకు తీసుకునే మొత్తంలో రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారు.

 Keerthy Suresh To Became Anchor For A Popular Tv Channel-TeluguStop.com

ఇప్పటి వరకు నాగార్జున, చిరంజీవి, రానా, నాని, ఎన్టీఆర్, తమన్నా, సమంత వంటి వారు పలు కార్యక్రమాలకు వ్యాఖ్యాతలుగా వ్యవహరించారు.ఇకపోతే వెండితెర నటసింహం నందమూరి బాలకృష్ణ మొట్టమొదటిసారిగా వ్యాఖ్యాతగా అన్ స్టాపబుల్ అనే కార్యక్రమానికి వ్యాఖ్యాతగా వ్యవహరించనున్నారు.

ఇదిలా ఉండగా వీరి బాటలోనే మరొక ఒక స్టార్ హీరోయిన్ యాంకర్ గా బుల్లితెరపై సందడి చేయడానికి సిద్ధమయ్యారు.

 Keerthy Suresh To Became Anchor For A Popular Tv Channel-యాంకర్ మారనున్న కీర్తి సురేష్.. రెమ్యూనరేషన్ ఎంతంటే-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com
Telugu Anchor, Keerthy Suresh, Remunaration, Tollywood, Tv Channel-Movie

దక్షిణాది సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్న మహానటి కీర్తి సురేష్ మొట్టమొదటిసారిగా బుల్లితెరపై సందడి చేయడానికి సిద్ధమయ్యారు.ఈ క్రమంలోనే ఈమె కార్యక్రమ నిర్వాహకులతో సంప్రదింపులు జరుపుతున్నట్లు సమాచారం.ఈమె కేవలం కార్యక్రమానికి వ్యాఖ్యాతగా వ్యవహరించడమే కాకుండా వారిని ఇంటర్వ్యూ చేస్తూ వారి వ్యక్తిగత విషయాలను కూడా అభిమానులతో పంచుకోనున్నారు.

ఇలా కీర్తి సురేష్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న ఈ కార్యక్రమానికి 15 లక్షల రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్లు సమాచారం.అయితే ఈ కార్యక్రమం ఏమిటి.ఎప్పుడు ప్రసారం అవుతుంది అనే విషయాల గురించి త్వరలోనే వెల్లడించనున్నట్లు తెలుస్తోంది.

#Anchor #TV Channel #Keerthy Suresh

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube