అలాంటి సినిమాలే చేస్తానంటున్న కీర్తి.. అవాక్కైన నిర్మాతలు.?

గీతాంజలి అనే మలయాళం సినిమాతో హీరోయిన్ గా కెరీర్ మొదలుపెట్టి తెలుగు, తమిళ భాషలలో వరుస అవకాశాలతో బిజీగా ఉన్నారు కీర్తి సురేష్.కెరీర్ తొలినాళ్ల నుంచి అభినయానికి ప్రాధాన్యత ఉన్న పాత్రల్లోనే నటిస్తున్న కీర్తి సురేష్ కు మహానటి సినిమా సౌత్ ఇండియా అంతటా గుర్తింపు తెచ్చింది.

 Keerthy Suresh Takes A Key Decision About Movies-TeluguStop.com

కీర్తి సురేష్ గురించి మాట్లాడుకోవాలంటే మహానటి సినిమాకు ముందు మహానటి సినిమాకు తరువాత అని మాట్లాడుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.
అయితే మహానటి సినిమా తరువాత కీర్తి సురేష్ నటించిన సినిమాలన్నీ బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్ ఫలితాన్ని అందుకుంటున్నాయి.

ముఖ్యంగా కీర్తి సురేష్ లేడీ ఓరియెంటెడ్ పాత్రల్లో నటించిన పెంగ్విన్, మిస్ ఇండియా సినిమాలు ఓటీటీలో విడుదల కాగా ఈ సినిమాలు కీర్తి సురేష్ స్థాయికి తగిన సినిమాలు కాదని కామెంట్లు వ్యక్తమయ్యాయి.మరికొన్ని రోజుల్లో కీర్తి నటించిన గుడ్ లక్ సఖి ఓటీటీలో విడుదల కానుండగా ఈ సినిమాపై పెద్దగా అంచనాలు లేవు.

 Keerthy Suresh Takes A Key Decision About Movies-అలాంటి సినిమాలే చేస్తానంటున్న కీర్తి.. అవాక్కైన నిర్మాతలు.-Gossips-Telugu Tollywood Photo Image-TeluguStop.com

కీర్తి నటిస్తున్న లేడీ ఓరియెంటెడ్ సినిమాలన్నీ ఆమెకు చేదు ఫలితాలనే ఇస్తుండటంతో ఆమె అభిమానులు, సన్నిహితులు కీర్తి సురేష్ కు సినిమాల ఎంపిక విషయంలో తప్పులు చేయొద్దని సూచించారు.దీంతో కీర్తికి జ్ఞానోదయం అయిందని ఇకపై కీర్తి సురేష్ స్టార్ హీరోల సినిమాల్లో మాత్రమే నటించాలని నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది.కీర్తి తాజా నిర్ణయంతో ఆమెతో లేడీ ఓరియెంటెడ్ సినిమాలు నిర్మించాలని అనుకున్న నిర్మాతలు అవాక్కవుతున్నారు.

ప్రస్తుతం కీర్తి నితిన్ కు జోడీగా రంగ్ దే, మహేష్ కు జోడీగా సర్కార్ వారి పాట సినిమాలో నటిస్తోంది.

ఈ సినిమాలతో పాటు వేదాళం సినిమాలో చిరంజీవి చెల్లెలిగా నటించబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి.మహానటి సినిమా ద్వారా పొందిన పాపులారిటీ అదే విధంగా ఉండాలంటే స్టార్ హీరోల సినిమాల్లో మాత్రమే నటించాలని కీర్తి భావిస్తున్నారని సమాచారం.

#LadyOriented #Keerthy Suresh #Miss India #Penguin #LadyOriented

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు