పెళ్లి గురించి ప్రశ్నించిన నెటిజన్... జేబు ఖాళీగా ఉందంటూ సమాధానం చెప్పిన నటి?

ప్రస్తుతం మన టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతోమంది సెలబ్రిటీలు( Celebrities ) పెళ్లిళ్లు చేసుకోకుండా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్ గా ఉండిపోతున్నారు.

ఇలా పెళ్లి కాని వారి గురించి లిస్ట్ తీస్తే చాలామంది ఉన్నారని చెప్పాలి.

హీరోలు మాత్రమే కాకుండా హీరోయిన్స్ కూడా పెళ్లి వయసు దాటిపోయిన ఇంకా పెళ్లి గురించి ఏమాత్రం ఆలోచించడం లేదు.అయితే తరచూ పెళ్లి గురించి వార్తల్లో నిలుస్తున్నటువంటి వారిలో కీర్తి సురేష్ ( Keerthy Suresh ) ఒకరు.

ఈమె త్వరలోనే పెళ్లి చేసుకోబోతుంది అంటూ ఇదివరకు ఎన్నోసార్లు వార్తలు వైరల్ అయ్యాయి.అయితే ఇప్పటివరకు ఈ నటి తన పెళ్లి గురించి ఏ విధమైనటువంటి క్లారిటీ ఇవ్వలేదు.

ఇక తాజాగా దసరా సినిమా( Dasara Movie ) ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన కీర్తి సురేష్ అద్భుతమైన విజయాన్ని అందుకున్నారు.గత కొన్ని రోజులుగా ఎలాంటి సక్సెస్ లేకుండా ఇండస్ట్రీలో కొనసాగుతున్న ఈమెకు దసరా సినిమా అద్భుతమైన సక్సెస్ అందించిందని చెప్పాలి.ఈ సినిమాలో వెన్నెల పాత్రలో కీర్తి సురేష్ ఎంతో అద్భుతంగా నటించి అందరిని ఆకట్టుకున్నారు.

Advertisement

ఇక ఈ సినిమా మంచి సక్సెస్ కావడంతో చిత్ర బృందం మొత్తం సక్సెస్ సెలబ్రేషన్స్ జరుపుకుంటున్నారు.

ఇక ఒకవైపు సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నటువంటి కీర్తి సురేష్ మరోవైపు సోషల్ మీడియా( Social Media )లో కూడా చాలా యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన అన్ని విషయాలను అభిమానులతో పంచుకుంటారు.ఈ క్రమంలోనే సరదాగా నేటిజన్స్ తో ఈమె చిట్ చాట్ చేయగా పలువురు నెటిజన్స్( Netizens ) ఈమెను వివిధ రకాల ప్రశ్నలు అడుగుతూ సమాధానాలు రాబట్టారు.ఈ క్రమంలోనే ఒక నెటిజన్ పెళ్లి గురించి కూడా ప్రశ్నించారు.

ఈ క్రమంలోనే కీర్తి సురేష్ ఈ ప్రశ్నకు సమాధానంగా జిఫ్ ఫైల్‌ను షేర్ చేసింది.అందులో లుంగీ ఎత్తినట్టు, జేబులు ఖాళీగా ఉన్నాయన్నట్టుగా చూపించింది.

జేబులు ఖాళీగా ఉన్నాయ్.ఇంకా బాగా సంపాదించిన తర్వాతే పెళ్లి చేసుకుంటానని ఈ సందర్భంగా ఈమె చెప్పినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

రజనీకాంత్ బర్త్ డే స్పెషల్.. ఈ స్టార్ హీరో గురించి ఈ షాకింగ్ విషయాలు మీకు తెలుసా?
Advertisement

తాజా వార్తలు