Keerthy Suresh : క్యూట్ ఎక్స్ ప్రెషన్స్ తో డబ్బింగ్ లో అదుర్స్ అనిపించిన కీర్తి.. మామూలు మహానటి కాదంటూ?

టాలీవుడ్ స్టార్ హీరో నాని హీరోయిన్ కీర్తి సురేష్( Keerthy Suresh ) జంటగా నటించిన తాజా చిత్రం దసరా.ఇటీవలే భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా ఎంతటి విజయాన్ని సాధించిందో మనందరికీ తెలిసిందే.

 Keerthy Suresh Shares Deleted Scene Her Own Dubbing-TeluguStop.com

మొదటి రోజే రికార్డు స్థాయిలో కలెక్షన్స్ ను రాబట్టింది.అయితే మొదట్లో కలెక్షన్స్ బాగానే ఉన్నప్పటికీ రాను రాను పూర్తిగా తగ్గిపోయాయి.

ఈ సినిమాలో కీర్తి సురేష్ నాని( nani ) ఇద్దరు మొదటిసారిగా మాస్ లుక్ లో కనిపించడంతోపాటు నటనను కూడా ఇరగదీశారు.ఈ సినిమాలో ఇద్దరిని నటనకు గాను మంచి మార్కులే పడ్డాయి.

ఈ సినిమాలో కీర్తి, నాని నటనకు ఫ్యాన్స్ ఫిదా అయిపోయారు.

సినీ ప్రముఖులు( Movie celebrities ) సైతం వీరిపై ప్రశంసల వర్షం కురిపించారు.ప్రస్తుతం థియేటర్లలో విజయవంతంగా ప్రదర్శితమవుతున్న ఈ సినిమా త్వరలోనే ఓటీటీలోకి కూడా రానుంది.కాగా ఈ సినిమా విడుదలైన మొదటి రోజే భారీగా కలెక్షన్స్ రాబట్టి నాని కెరియర్ లో అత్యధిక కలెక్షన్ సాధించిన సినిమాగా కూడా నిలిచింది.

ఈ సినిమాలో ముఖ్యంగా కీర్తి సురేష్ తెలంగాణ యాసలో మాట్లాడి అల్లరి అల్లరి చేస్తూ ప్రేక్షకులను కట్టిపడేసింది.ఈ సినిమాలో కీర్తి సురేష్ తనకు తానే డబ్బింగ్ చెప్పుకున్న విషయం తెలిసిందే.

ఇది ఇలా ఉంటే తాజాగా హీరోయిన్ కీర్తి సురేష్ తన ఇంస్టాగ్రామ్ ఖాతాలో ఒక వీడియోని షేర్ చేసింది.ఆ వీడియో తనపాత్రకు తానే డబ్బింగ్ చెబుతూ కనిపించింది.కానీ ఆ సీన్ ని సినిమా నుంచి తొలగించినట్లు కీర్తి సురేష్ వెల్లడించింది.కీర్తి తన ఇన్‌స్టాలో రాస్తూ.దసరా మూవీలో తొలగించిన సీన్ ఇది.ఆ సీన్‌కు నేనే డబ్బింగ్ చెప్పాను.డబ్బింగ్ చెబుతున్నప్పుడు నన్ను చూసి అంతా టెన్షన్ పడ్డారు.డబ్బింగ్ ఒక అద్భుతమైన కళ అని రాసుకొచ్చింది కిర్తి సురేష్.ఆ వీడియోలో కీర్తి సురేశ్ తెలుగు డబ్బింగ్ చూస్తే ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే.దసరా( Dussehra ) సినిమా విడుదలైన తర్వాత కొద్ది రోజులు పాటు కీర్తి సురేష్ లుక్ కి సంబంధించిన ఫోటోలు వీడియోలు అల్లరి చేస్తున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయిన విషయం తెలిసిందే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube