పార్ట్‌నర్‌తో పిక్నిక్ కు వెళ్లిన కీర్తి సురేష్.. అసలేమైందంటే..?

నేను శైలజ, నేను లోకల్ సినిమాలతో కెరీర్ తొలినాళ్లలోనే వరుస విజయాలను సొంతం చేసుకున్న కీర్తి సురేష్ కు స్టార్ హీరోల సినిమాలలో అవకాశాలు వస్తున్నా సక్సెస్ మాత్రం దక్కడం లేదు.అయితే సోషల్ మీడియాలో మాత్రం కీర్తి సురేష్ యాక్టివ్ గా ఉండటంతో పాటు వ్యక్తిగత విషయాలను పంచుకుంటూ సందడి చేస్తున్నారు.

 Keerthy Suresh Share Her Picnic Photos Her Pet Nick-TeluguStop.com

గతంలో బొద్దుగా ఉన్న కీర్తి సురేష్ ప్రస్తుతం స్లిమ్ లుక్ లోకి మారిపోయారు.

యోగా, ఫిట్ నెస్ కు సంబంధించిన వీడియోలను కీర్తి సురేష్ అభిమానులతో పంచుకుంటూ వార్తల్లో నిలుస్తున్నారు.

 Keerthy Suresh Share Her Picnic Photos Her Pet Nick-పార్ట్‌నర్‌తో పిక్నిక్ కు వెళ్లిన కీర్తి సురేష్.. అసలేమైందంటే..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

తాజాగా కీర్తి సోషల్ మీడియాలో పార్ట్ నర్ తో పిక్నిక్ కు వెళ్లారు.తన పెంపుడు కుక్క అయిన నైక్ తో దిగిన ఫోటోను షేర్ చేసిన కీర్తి సురేష్ పిక్నిక్ డేకు పిక్నిక్ కు వెళ్లడానికి సరైన పార్ట్ నర్ దొరికిందని పేర్కొన్నారు.

కీర్తి సురేష్ షేర్ చేసిన ఫోటో ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది.

బీచ్ తీరంలో సరైన తోడుతో ఆహ్లాదంగా ఉన్న వాతావరణంలో పిక్నిక్ ఇంతకుముంచి ఏం కావాలని కీర్తి సురేష్ పోస్ట్ లో పేర్కొన్నారు.కీర్తి సురేష్ నటించిన గుడ్ లఖ్ సఖి త్వరలో రిలీజ్ కనుంది.మొదట ఈ సినిమా ఓటీటీలో రిలీజవుతుందని వార్తలు వచ్చినా థియేటర్లలోనే ఈ సినిమా రిలీజ్ కానుండటం గమనార్హం.

మరోవైపు కీర్తి సురేష్ మహేష్ హీరోగా తెరకెక్కుతున్న సర్కారు వారి పాట సినిమా రిలీజ్ కానుంది.

ఈ సినిమాలో కీర్తి పాతకు సంబంధించి అనేక వార్తలు వైరల్ అవుతుండగా బ్యాంక్ ఉద్యోగి పాత్రలో కీర్తి సురేష్ నటించనున్నట్టు వార్తలు వస్తున్నాయి.అయితే ఈ వార్తలు నిజమో కాదో తెలియాలంటే కొన్నిరోజులు ఆగాల్సిందే.ఈ సినిమాతో కీర్తి బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంటారని ఆమె ఫ్యాన్స్ భావిస్తున్నారు.

#Sarkaruvaripata #BankEmpolye #Keerthy Partner #Fitness #Keerthy Suresh

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు