కీర్తి బాగానే లాగుతోందిగా..!  

Keerthy Suresh Taking Huge Remuneration Per Movie, Keerthy Suresh, Remuneration, Penguin, Sarkaru Vaari Paata - Telugu Keerthy Suresh, Penguin, Remuneration, Sarkaru Vaari Paata

టాలీవుడ్‌లో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన కీర్తి సురేష్‌కు వరుసగా సినిమాలు చేసినా రాని గుర్తింపు, ఒక్క మహానటి చిత్రంతో వచ్చింది.ఆ సినిమాలో ఆమె నటన గురించి ప్రత్యేకించి చెప్పక్కర్లేదు.

 Keerthy Suresh Remuneration Penguin

ఇక ఈ సినిమా అందించిన సక్సెస్‌తో ప్రస్తుతం తెలుగు, తమిళ భాషల్లో వరుసబెట్టి సినిమాలు చేస్తూ దూసుకుపోతుంది.ఇటీవల ‘పెంగ్విన్’ అనే లేడీ ఓరియెంటెడ్ సినిమాలో నటించి మెప్పించిన ఈ బ్యూటీ రెమ్యునరేషన్ పరంగా కూడా దూసుకుపోతుంది.

కీర్తి సురేష్ నటిస్తున్న సినిమాల్లో ఆమె పాత్రలను బట్టి రెమ్యునరేషన్‌ను డిసైడ్ చేస్తోంది ఈ బ్యూటీ.సినిమాలో హీరో పక్కన హీరోయిన్ పాత్ర అయితే రూ.కోటి నుండి కోటిన్నర డిమాండ్ చేస్తోన్న కీర్తి, లేడీ ఓరియెంటెడ్ సినిమాలకు రూ.కోటిన్నర డిమాండ్ చేస్తున్నట్లు తెలుస్తోంది.

కీర్తి బాగానే లాగుతోందిగా..-Gossips-Telugu Tollywood Photo Image

ఏదేమైనా మహానటి చిత్రంతో వచ్చిన క్రేజ్‌ను కీర్తి పాప బాగానే క్యాష్ చేసుకుంటుందని ఆమె అభిమానులు అంటున్నారు.ఇక ఈ బ్యూటీ ఇప్పుడు హీరోయిన్లందరికంటే ఎక్కువగా సినిమలను లైన్‌లో పెట్టింది ఈ బ్యూటీ.

పెంగ్విన్ చిత్రంతో మంచి విజయాన్ని అందుకున్న కీర్తి సురేష్, ప్రస్తుతం ‘మిస్ ఇండియా’ చిత్రంలో నటిస్తోంది.ఈ సినిమాను నరేంద్ర నాథ్ డైరెక్ట్ చేస్తుండగా, మహేష్ కోనేరు ప్రొడ్యూస్ చేస్తున్నారు.

ఈ సినిమా కూడా లేడీ ఓరియెంటెడ్ మూవీ కావడంతో కీర్తి ఈ సినిమాపై భారీ అంచనాలు పెట్టుకుంది.ఇక ఈ సినిమాను కూడా ఓటీటీలో రిలీజ్ చేస్తారేమో చూడాలి.

#Keerthy Suresh #Remuneration #Penguin

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Keerthy Suresh Remuneration Penguin Related Telugu News,Photos/Pics,Images..