పిలిచి హీరోయిన్ పాత్ర ఇస్తున్న చెల్లి రోల్స్ చేస్తా అంటున్న మహానటి .

క్యూట్ హీరోయిన్ కీర్తి సురేశ్. ‘మహానటి’ సినిమాతో నేషనల్ అవార్డు గెలుచుకుని, జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకుంది.

 Keerthy Suresh Preferred Only Sister Roles-TeluguStop.com

ప్రజెంట్ తెలుగు, తమిళ్, మలయాళ భాషల్లో పలు చిత్రాల్లో నటిస్తున్న ఈ ముద్దుగుమ్మకు సిస్టర్ సెంటిమెంట్ ఉందని చర్చ నడుస్తున్నది.ఇందుకు ఆమె ఎంచుకున్న సినిమా సబ్జెక్ట్సే కారణమట.

ఓ వైపు హీరోయిన్‌గా పలు సినిమాల్లో నటిస్తూనే మరోవైపున స్టార్ హీరోస్‌కు సిస్టర్‌గా కీర్తిసురేశ్ నటించడం పట్ల సినీ పరిశ్రమకు చెందిన వ్యక్తులతో పాటు సినీ అభిమానులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.కీర్తి సురేశ్ ప్రస్తుతం ఆరు చిత్రాల్లో నటిస్తుండగా, అందులో మూడు చిత్రాల్లో కీర్తి స్టార్ హీరోల చెల్లెలి పాత్రలు పోషిస్తుందట.

 Keerthy Suresh Preferred Only Sister Roles-పిలిచి హీరోయిన్ పాత్ర ఇస్తున్న చెల్లి రోల్స్ చేస్తా అంటున్న మహానటి-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

టాలీవుడ్ మెగా‌స్టార్ చిరంజీవి -మెహర్ రమేశ్ కాంబోలో రూపొందుతున్న ‘భోళా శంకర్’ మూవీలో కీర్తి సురేశ్ మెగాస్టార్ చెల్లెలిగా కనిపించబోతుంది.

రాఖీ పండుగ సందర్భంగా మేకర్స్ ఆల్రెడీ పోస్టర్ రిలీజ్ చేసి అనౌన్స్‌మెంట్ కూడా ఇచ్చేశారు.

ఈ చిత్రం అజిత్ కుమార్ నటించిన తమిళ్ సూపర్ హిట్ ఫిల్మ్ ‘వేదాళం’ రీమేక్.మాస్ డైరెక్టర్ శివ- తమిళ్ తలైవా, సూపర్ స్టార్ రజనీకాంత్ కాంబోలో వస్తున్న ‘అన్నాత్తె’ సినిమాలోనూ రజనీకి సోదరిగా కీర్తి సురేశ్ కనిపించనున్నట్లు తెలుస్తోంది.

Telugu Annathhe Movie, Bhola Shankar, Keerhty Suresh Importance To Sister Roles, Keerthy Suresh, Keerthy Suresh Sister Roles Movies, Megastar Chiranjeevi, Rajnikanth, Sani Kaidam, Selva, Sister Roles-Movie

డైరెక్టర్ సెల్వ రాఘవన్ హీరోగా వస్తున్న ‘సాని కాయిదమ్’ చిత్రంలోనూ కీర్తి హీరో సెల్వకు చెల్లెలిగా కనిపించనుందట.అరుణ్ మాతేశ్వరన్ దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రంలో కీర్తి, సెల్వ డీ గ్లామరైజ్డ్ పాత్రల్లో కనిపించనున్నారు.మొత్తంగా హీరోయిన్‌గా రాణిస్తూనే క్రేజీ ప్రాజెక్ట్స్‌లో సిస్టర్ రోల్స్ ప్లే చేసేందుకు కీర్తి ప్రాధాన్యత ఇవ్వడం పట్ల పలువురు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.అయితే, సినిమాల్లో పాత్ర ప్రాధాన్యత ఉన్నది కాబట్టే ‘మహానటి’ కీర్తి సురేశ్ ఆ పాత్రల్లో నటించేందుకుగాను ఒప్పుకుందని కొందరు వాదిస్తున్నారు.

#Selva #Sister Roles #KeerhtySuresh #Sani Kaidam #Keerthy Suresh

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు