పెంగ్విన్ టీజర్ టాక్: సస్పెన్స్ థ్రిల్లర్‌తో వస్తున్న కీర్తి

మహానటి చిత్రంతో అన్ని భాషల ప్రేక్షకులను ఆకట్టుకున్న మలయాళ బ్యూటీ కీర్తి సురేష్, ప్రస్తుతం చాలా సెలెక్టివ్‌గా సినిమాలు చేస్తోంది.ఇదివరకు కమర్షియల్ సినిమాలకే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చిన ఈ బ్యూటీ, తాజాగా పెంగ్విన్ అనే సినిమాను తెరకెక్కిస్తోంది.

 Keerthy Suresh Penguin Teaser, Keerthy Suresh, Penguin Movie, Keerthy Suresh Pen-TeluguStop.com

తమిళంలో సూపర్ సక్సెస్ అందుకుంటున్న దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ ఈ సినిమాను ప్రొడ్యూస్ చేస్తుండటంతో ఈ సినిమాపై మంచి అంచనాలు క్రియేట్ అయ్యాయి.

వేసవి కానుకగా ఈ సినిమాను రిలీజ్ చేద్దామని చిత్ర యూనిట్ భావించినా, లాక్‌డౌన్ కారణంగా అది కుదరలేదు.

కాగా తాజాగా ఈ సినిమా టీజర్‌ను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది.ఈ టీజర్ చూస్తుంటే ఇదొక పూర్తి సస్పెన్స్ థ్రిల్లర్ కథతో తెరకెక్కినట్లు తెలుస్తోంది.వరుసగా జరిగే హత్యలు, వాటి వెనకాల ఉన్న హంతకులు ఎవరనే విషయాలను ఈ సినిమాలో మనకు చూపించేందుకు చిత్ర యూనిట్ రెడీ అయ్యింది.ఇక కీర్తి సురేష్ కూడా ఈ హత్యలకు కారణమైన వారి వల్ల తన కొడుకును కోల్పోవడం, వారిని పట్టుకునేందుకు ఆమె వంతు ప్రయత్నం చేయడం లాంటివి ఈ సినిమాలో మనకు కనిపించనున్నాయి.

మొత్తంగా చూస్తే ఈ సినిమా ఒక పూర్తి క్రైమ్ థ్రిల్లర్ మూవీగా వస్తుండగా, కార్తీక్ సుబ్బరాజ్ ఈ సినిమాను ప్రొడ్యూస్ చేస్తున్నాడు.ఈశ్వర్ కార్తిక్ ఈ సినిమాను డైరెక్ట్ చేస్తుండటంతో ఈ సినిమాలో ఎలాంటి ట్విస్టులు ఉంటాయా అని అందరూ ఎదురుచూస్తున్నారు.

మరి పెంగ్విన్ అనే టైటిల్‌ను ఈ సినిమాకు ఎందుకు పెట్టారో తెలియాలంటే మాత్రం ఈ క్రైమ్ థ్రిల్లర్ రిలీజ్ అయ్యే వరకు ఆగాల్సిందే.ఇక ఈ సినిమాను థియేటర్స్ లేకపోవడంతో అమెజాన్ ప్రైమ్‌లో జూన్ 19న రిలీజ్ చేయనున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube