కరోనా లాక్‌డౌన్ కారణంగా ప్రేక్షకులకు సినిమాలే లేకుండా అయ్యాయి.ఓటీటీల్లో వెబ్ సిరీస్‌లు చూస్తే టైం పాస్ చేస్తున్నారు.
ఈ సమయంలో థియేటర్లలో విడుదల కావాల్సిన పెంగ్విన్ సినిమా ఓటీటీ ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది.థియేటర్లలో విడుదల ఇప్పట్లో సాధ్యం కాదని భావించిన పెంగ్విన్ మేకర్స్ అమెజాన్ ప్రైమ్ ద్వారా ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చారు.
కీర్తి సురేష్ హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రంకు ఈశ్వర్ కార్తీక్ దర్శకత్వం వహించాడు.భారీ అంచనాల నడుమ రూపొందిన ఈ చిత్రం నేడు అమెజాన్‌లో స్ట్రీమింగ్ మొదలు అయిన నేపథ్యంలో చాలా మంది ఈ సినిమాను చూశారు.
సినిమా ప్రమోషన్ కోసం భారీగా ఖర్చు చేశారు.టీజర్ మరియు ట్రైలర్‌తో సినిమాపై అంచనాలు పెంచేశారు.ఆ కారణంగానే సినిమాను చూడాలని చాలా మంది కోరుకున్నారు.సినిమా విలన్ గురించి కథ గురించి చిత్రీకరణ విషయాల గురించి చెబుతూ సినిమాపై జనాల్లో ఆసక్తి రేకెత్తించి ఊరించారు.
కాని నేడు విడుదలైన పెంగ్విన్ సినిమా ప్రేక్షకులను ఉసూరుమనిపించింది.కీర్తి సురేష్ నటన చాలా బాగుందంటూ ప్రశంసలు అయితే దక్కుతున్నాయి.
కాని కీర్తి సురేష్‌ను అలా చూడలేక పోతున్నామని ఎక్కువ మంది ప్రేక్షకులు అంటున్నారు.
ఒక బాబు గురించి సాగిన ఈ కథ సస్పెన్స్ థ్ల్రిలర్‌గా ఉంది.కాని నాచురాలిటీకి చాలా దూరంగా ఈ చిత్రం ఉండటంతో ప్రేక్షకులు పెదవి విరుస్తున్నారు.ఈ సినిమా థియేటర్లలో విడుదల అయినా కూడా బయ్యర్లకు నష్టం వాటిల్లేది అనేది కొందరి అభిప్రాయం.
ఈ సినిమాకు రివ్యూలు రాసిన చాలా మంది కూడా నిరాశపర్చింది అంటూ సోషల్ మీడియాలో పేర్కొన్నారు.చాలా అంచనాల నడుమ విడుదలైన పెంగ్విన్ సినిమా ఇలా నిరాశపర్చడంతో భారీ మొత్తానికి కొనుగోలు చేసిన అమెజాన్‌కు నష్టాలు తప్పవంటున్నారు.