కీర్తి చేతిలో ఉన్నవన్నీ ఆమె కీర్తిని పెంచేవే  

keerthy suresh next year coming with 6 movies in different languages ,keerthy suresh, 6 movies , keerthy suresh upcoming movies, keerthy suresh birthday, sarkaru vaari paata, good luck sakhi - Telugu Good Luck Sakhi, Keerthy Suresh, Sarkaru Vaari Paata, Telugu Heroine

టాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ కీర్తి సురేష్‌ ప్రస్తుతం సౌత్‌ ఇండియాలోనే స్టార్ హీరోయిన్‌.నయనతార తర్వాత కీర్తి సురేష్‌ అత్యధిక పారితోషికం తీసుకుంటున్న సౌత్‌ హీరోయిన్‌గా కూడా పేరు దక్కించుకుంది.

TeluguStop.com - Keerthy Suresh Next Year Coming With 6 Movies

మహానటి సినిమా తర్వాత ఈమె జాతీయ స్థాయి గుర్తింపును దక్కించుకుంది.అద్బుతమైన ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ ఉన్న కీర్తి సురేష్‌ నేడు పుట్టిన రోజు జరుపుకుంటుంది.

ఈ సందర్బంగా ఈమెకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం.ఈ సమయంలో ఆమె నటిస్తున్న సినిమాలకు సంబంధించిన వార్తలు పరిశీలిస్తే ఆమె క్రేజ్‌ ఏంటీ ఆమె స్టార్‌ డం ఏంటీ అనేది క్లారిటీ వచ్చేసింది.

TeluguStop.com - కీర్తి చేతిలో ఉన్నవన్నీ ఆమె కీర్తిని పెంచేవే-Latest News - Telugu-Telugu Tollywood Photo Image

ప్రస్తతం ఈమె నితిన్‌ తో రంగ్‌ దే సినిమాలో నటిస్తుంది.ఇక ఈమె నటించిన మిస్‌ ఇండియా మరియు గుడ్‌ లక్‌ సఖి సినిమాలు విడుదలకు సిద్దం అవుతున్నాయి.

ఈ మూడు సినిమాలతో పాటు తమిళనాట సూపర్‌ స్టార్‌ రజినీకాంత్‌ తో అన్నాత్తే సినిమాలో నటిస్తుంది.ఇక నేడు ఈమె సూపర్‌ స్టార్‌ మహేష్‌బాబు సినిమాలో కూడా నటించబోతున్నట్లుగా అధికారిక ప్రకటన వచ్చింది.

అంటే ఈమె నటిస్తున్న నటించిన సినిమాలు వచ్చే ఏడాది వరుసగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి.అరడజను వరకు ఈమె వచ్చే ఏడాది సినిమాలను ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నాయి.

ఆ సినిమాలన్ని కూడా చాలా ప్రతిష్టాత్మకమైన సినిమాలే.కనుక ఈ అమ్మడి క్రేజ్‌ వచ్చే ఏడాది సినిమాలు విడుదల తర్వాత అమాంతం పెరిగే అవకాశం ఉందని ఇండస్ట్రీ వర్గాల వారు మరియు అభిమానులు చాలా నమ్మకంగా చెబుతున్నారు.

తెలుగులో ఈమెకు ఇంకా చాలా ఆఫర్లు వచ్చినా కూడా కొన్ని సినిమాలను ఈమె హోల్డ్‌ లో పెట్టింది.గోపీచంద్‌ హీరోగా తేజ దర్శకత్వంలో రూపొందబోతున్న సినిమాలో కూడా ఈమెను హీరోయిన్‌గా అనుకుంటున్నారట.

కాని ఆ సినిమా అధికారిక ప్రకటన రాలేదు.కనుక కాస్త సమయం పట్టే అవకాశం ఉంది అంటున్నారు.

మొత్తానికి ఈమె చేతిలో ఉన్న ప్రాజెక్ట్‌ లు అన్ని కూడా ఆమె కీర్తిని పెంచేవి అనడంలో సందేహం లేదు.

#Keerthy Suresh #SarkaruVaari #Good Luck Sakhi

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Keerthy Suresh Next Year Coming With 6 Movies Related Telugu News,Photos/Pics,Images..