పాపం.. కీర్తికే ఎందుకిలా జరుగుతోంది?  

Keerthy Suresh Next Movie On OTT, Keerthy Suresh, Penguin, OTT, Miss India, Tollywood News - Telugu Keerthy Suresh, Miss India, Ott, Penguin, Tollywood News

కరోనా వైరస్ కారణంగా రెండు నెలలకు పైగా థియేటర్స్ మూతపడటంతో ప్రేక్షకులు ఓటీటీలకు బాగా అలవాటు పడ్డారు.దీంతో ఓటీటీల్లో డిజిటల్ కంటెంట్‌ను చాలా వైవిధ్యంగా తెరకెక్కించడంతో పాటు పలు కొత్త సినిమాలను నేరుగా ఓటీటీల్లో రిలీజ్ చేస్తుండటంతో ప్రేక్షకులు వీటిని ఎక్కువ సంఖ్యలో వీక్షిస్తున్నారు.

 Keerthy Suresh Next Movie On Ott

కాగా చిన్న సినిమాలే కాకుండా ప్రేక్షకుల్లో మంచి అంచనాలు క్రియేట్ చేసిన సినిమాలు కూడా ఓటీటీల్లో రిలీజ్ అవుతున్నాయి.

ఇప్పటికే అందాల భామ కీర్తి సురేష్ నటించిన పెంగ్విన్ చిత్రాన్ని నేరుగా ఓటీటీలో రిలీజ్ చేయడంతో ప్రేక్షకులు ఈ సినిమాను బాగా ఆదరించారు.

పాపం.. కీర్తికే ఎందుకిలా జరుగుతోంది-Gossips-Telugu Tollywood Photo Image

దీంతో ఇప్పుడు కీర్తి సురేష్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘మిస్ ఇండియా’ రిలీజ్‌కు రెడీ అయ్యింది.మహేష్ కోనేరు ప్రొడ్యూస్ చేస్తున్న ఈ సినిమాపై కీర్తి సురేష్ భారీ అంచనాలు పెట్టుకుంది.

అయితే ఇప్పుడు ఈ సినిమాను కూడా ఓటీటీలో రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ చూస్తోంది.నరేంద్ర నాథ్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో కీర్తి సురేష్ చాలా గెటప్స్‌లో కనిపిస్తుందని, అది ఆమె ఫ్యాన్స్‌ను థ్రిల్ చేయడం ఖాయమని చిత్ర వర్గాలు అంటున్నాయి.

మరి ఈ సినిమాతో కీర్తి సురేష్ ప్రేక్షకులను ఎంతవరకు మెప్పిస్తుందో తెలియాలంటే సినిమా రిలీజ్ అయ్యే వరకు ఆగాల్సిందే.ఇక ఈ సినిమాలో జగపతి బాబు, రాజేంద్ర ప్రసాద్, నదియా, నవీన్ చంద్ర తదితరులు నటిస్తున్న ఈ సినిమాతో కీర్తి సురేష్ ఎలాంటి సక్సెస్‌ను అందుకుంటుందో చూడాలి.

#Keerthy Suresh #OTT #Miss India #Penguin

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Keerthy Suresh Next Movie On Ott Related Telugu News,Photos/Pics,Images..