మరి కొన్నాళ్లు వెయిట్‌ చేయాలంటూ నిర్మాతలకు కీర్తి సురేష్ విజ్ఞప్తి

హీరోయిన్ కీర్తి సురేష్( Keerthy suresh ) ఈ మధ్య కొత్త సినిమాలకు కమిట్ అవ్వడం లేదు.తాను నాని తో( Nani ) కలిసి నటించిన దసరా చిత్రం( Dasara movie ) ప్రేక్షకుల ముందుకు వచ్చిన తర్వాత మాత్రమే కొత్త సినిమాలకు ఓకే చెబుతానంటూ కండిషన్ పెడుతుందట.

 Keerthy Suresh Next Film After Nani Dasara Movie Release Details, Dasara, Keerth-TeluguStop.com

ఈ మధ్య కాలంలో ఇద్దరు ముగ్గురు తెలుగు నిర్మాతలు ఆమె ను తమ సినిమాల్లో నటించాల్సిందిగా సంప్రదించడం జరిగిందట.కానీ ఇప్పటి వరకు ఆమె ఏ ఒక్క సినిమాకి ఓకే చెప్పలేదు.

దసరా సినిమా విడుదలైన తర్వాత మాత్రమే కొత్త సినిమా ఒప్పుకుంటానని ఆమె చెప్పడం తో ప్రస్తుతం ఆమె తో సినిమాలు చేయాలనుకుంటున్న దర్శక నిర్మాతలు దసరా సినిమా విడుదల కోసం వెయిట్ చేస్తున్నట్లుగా సమాచారం అందుతుంది.మరో వైపు చిరంజీవి హీరో గా నటిస్తున్న భోళా శంకర్( Bhola shankar ) చిత్రం లో కూడా ఈమె నటిస్తోంది.అయితే ఆ సినిమా లో చిరంజీవి కి చెల్లెలి పాత్ర లో నటిస్తున్న కారణంగా కీర్తి సురేష్ కి ఆ సినిమా పై ఎక్కువగా ఆశలు లేవు, కానీ దసరా సినిమా ఖచ్చితంగా భారీ విజయాన్ని సొంతం చేసుకుంటుందనే నమ్మకాన్ని కలిగి ఉంది.

అందుకే దసరా సినిమా విడుదలైన తర్వాత మాత్రమే తన తదుపరి సినిమాని కమిట్ అవుతానంటూ చెప్పుకొచ్చింది.దసరా సినిమా హిట్ అయితే కచ్చితంగా కీర్తి సురేష్ మూడు కోట్ల పారితోషికం డిమాండ్ చేసే అవకాశాలు ఉన్నాయని ఇండస్ట్రీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.తమిళంలో కూడా కీర్తి సురేష్ ఈ మధ్య కాలంలో ఎక్కువ సినిమాలకు కమిట్ అవ్వడం లేదు.

తన స్థాయికి తగ్గట్లుగా మంచి సినిమాల్లో నటించే అవకాశం రావడం లేదు అంటూ ఆమె వచ్చిన ఆఫర్లను కాదంటుందట.దసరా సినిమా తర్వాత తమిళనాట కూడా మంచి పాపులారిటీని ఈ అమ్మడు దక్కించుకుంటుందేమో చూడాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube