పెంగ్విన్ దెబ్బకు రూటు మార్చిందిగా!  

Keerthy Suresh Miss India No For OTT Release, Keerthy Suresh, Miss India, OTT, Tollywood News, Mahesh Koneru - Telugu Keerthy Suresh, Mahesh Koneru, Miss India, Ott, Tollywood News

అందాల భామ కీర్తి సురేష్ నటించిన లేటెస్ట్ మూవీ ‘పెంగ్విన్’ ఇటీవల నేరుగా ఓటీటీలో రిలీజ్ అయ్యి మంచి విజయాన్ని అందుకుంది.ఈ సినిమాను తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో రిలీజ్ చేయగా, ఒక్కోచోట ఒక్కో ఫలితాన్ని దక్కించుకుంది.

 Keerthy Suresh Miss India No For Ott Release

అయితే తెలుగులో మాత్రం ఈ సినిమాకు పెద్ద ఆదరణ దక్కలేదు.దీంతో చిత్ర నిర్మాతలకు నష్టాలు మాత్రమే మిగిలాయి.

ఇక ఈ సినిమా సాధించిన రిజల్ట్‌తో ఇప్పుడు కీర్తి సురేష్ ఆలోచనలో పడింది.

పెంగ్విన్ దెబ్బకు రూటు మార్చిందిగా-Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image

ఆమె నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘మిస్ ఇండియా’ కూడా రిలీజ్‌కు రెడీగా ఉంది.

ఈ సినిమాను వేసవి కానుకగా రిలీజ్ చేయాలని చిత్ర యూనిట్ భావించింది.కానీ కరోనా వైరస్ కారణంగా ఈ సినిమా వాయిదా పడింది.

అయితే ఇప్పటికే పెంగ్విన్ చిత్రం ఓటీటీలో రిలీజ్ కావడంతో మిస్ ఇండియా చిత్రాన్ని కూడా ఓటీటీలో రిలీజ్ చేయాలంటూ చిత్ర నిర్మాత మహేష్ కోనేరుకు అదిరిపోయే ఆఫర్లు వచ్చి పడుతున్నాయి.దీంతో ఈ సినిమాను ఓటీటీలో రిలీజ్ చేస్తారనే టాక్ ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తుంది.

అయితే ఈ వార్తల్లో ఎలాంటి నిజం లేదని చిత్ర నిర్మాత మహేష్ కోనేరు అంటున్నారు.ఏది ఏమైనా ఈ సినిమాను థియేటర్లలోనే రిలీజ్ చేస్తామని ఆయన అంటున్నారు.

దీంతో మిస్ ఇండియా చిత్ర ఓటీటీ రిలీజ్ వార్తలకు చెక్ పడింది.ఇక ఈ సినిమాను నాగేంద్ర నాథ్ డైరెక్ట్ చేస్తుండగా పూర్తి రొమాంటిక్ డ్రామా ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమా తెరకెక్కింది.

మరి ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు ఎప్పుడు వస్తుందో చూడాలి.

#OTT #Keerthy Suresh #Mahesh Koneru #Miss India

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Keerthy Suresh Miss India No For Ott Release Related Telugu News,Photos/Pics,Images..