కెరియర్ మొదట్లో నన్ను ఐరన్ లెగ్ అన్నారు... ఆవేదన వ్యక్తం చేసిన మహానటి!

ఎనర్జిటిక్ స్టార్ హీరో రామ్ హీరోగా నేను శైలజ చిత్రం ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ముద్దుగుమ్మ కీర్తి సురేష్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఈమె ఎన్నో చిత్రాల్లో నటించి తన కంటూ ఓ మంచి గుర్తింపును సంపాదించుకున్నారు.

 Keerthy Suresh Iron Leg Comment , Keerthi Suresh ,tollywood , Iron Leg , Sarkaru Vari Paata , Maha Nati , Savitri , National Award ,bhola Sankar-TeluguStop.com

ఇక సావిత్రి జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన మహానటి చిత్రం ద్వారా ఏకంగా జాతీయ అవార్డును కూడా సొంతం చేసుకుని స్టార్ హీరోయిన్ గా మారిపోయింది.అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన కీర్తి సురేష్ కెరియర్ మొదట్లో తాను ఎదుర్కొన్న అవమానాలు గురించి బయటపెట్టారు.

కెరియర్ మొదట్లో మలయాళ ఇండస్ట్రీలో ఈమె ఒక సినిమాలో నటించారు.అయితే ఆ సినిమా కొన్ని కారణాల వల్ల విడుదల కాలేదు.

 Keerthy Suresh Iron Leg Comment , Keerthi Suresh ,tollywood , Iron Leg , Sarkaru Vari Paata , Maha Nati , Savitri , National Award ,bhola Sankar-కెరియర్ మొదట్లో నన్ను ఐరన్ లెగ్ అన్నారు#8230; ఆవేదన వ్యక్తం చేసిన మహానటి-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఆ సినిమా తరువాత మరో రెండు సినిమాలలో నటించినా అవి కూడా మధ్యలోనే ఆగిపోయాయి.ఇలా తాను నటించిన సినిమాలు ఆగిపోవడంతో చాలామంది నన్ను ఐరన్ లెగ్ అంటూ అవమానించారని ఈమె ఆవేదన వ్యక్తం చేశారు.

ఇలా ఈ మాటలు తనను ఎంతో బాధ పెట్టాయని, కానీ వాటన్నింటినీ పట్టించుకోకుండా నా పని నేను చేసుకుంటూ వెళ్లానని తెలిపారు.

ఇలా తనకు మాత్రమే కాకుండా కెరియర్ మొదట్లో ఎంతో మంది ఇలాంటి అవమానాలను ఎదుర్కొన్నారని ప్రతి ఒక్కరూ ఇదే విధంగా బాధ పడి ఉంటారని తెలిపారు.ఈ ఐరన్ లెగ్ అనే ముద్ర నుంచి బయట పడటం కోసం నాకు సుమారు మూడు సంవత్సరాల టైం పట్టింది.అప్పుడు ఎవరైతే నన్ను ఐరన్ లెగ్ అని విమర్శించారో ఇప్పుడు వారు నా కంటికి కూడా కనిపించడం లేదని కీర్తి సురేష్ తనకు జరిగిన అవమానం గురించి ఈ సందర్భంగా బయటపెట్టారు.

ఇక ప్రస్తుతం ఈమె మహేష్ బాబు సరసన సర్కారీ వారి పాట చిత్రంలో నటిస్తున్నారు.అదే విధంగా మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న భోళా శంకర్ సినిమాలో చిరు చెల్లెలు పాత్ర ద్వారా ప్రేక్షకుల ముందుకు రానున్నారు.

Video : Keerthy Suresh Iron Leg Comment , Keerthi Suresh ,tollywood , Iron Leg , Sarkaru Vari Paata , Maha Nati , Savitri , National Award ,bhola Sankar

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube