'పెద్దయ్యాక సమంత అవుతా'..క్యూట్ వీడియో షేర్ చేసిన కీర్తి.. వీడియో వైరల్!

సౌత్ లోనే కాకుండా ఇండియా మొత్తం లో ఫ్యాన్ ఫాలోయింగ్ ను కలిగి ఉన్న ప్రతిభావంతమైన నటీనటుల్లో సమంత రూత్ ప్రభు ఒకరు.ఈమె ఇది వరకు కంటే ఇటీవల కాలంలో మరింత పాపులర్ అయ్యింది.

 Keerthy Suresh Introduces Samantha To Her Die Hard Fan The Video Is Too Cute Det-TeluguStop.com

సమంత విడాకుల తర్వాత ఇండియా వ్యాప్తంగా ఈమె కు ఫాలోయింగ్ పెరిగింది.విడాకుల తర్వాత వరుస సినిమాలు చేస్తూ మంచి జోరు మీద ఉంది.

ఈమె స్టార్ డం అయిపొయింది అని అంతా అనుకున్నారు.కానీ అనూహ్యంగా ఈమెకు వరుస అవకాశాలు వస్తున్నాయి.పాన్ ఇండియా సినిమాల్లో సైతం సమంత ను కావాలని దర్శక నిర్మాతలు అడుగుతున్నట్టు తెలుస్తుంది.ఇంతటి ఫ్యాన్ ఫాలోయింగ్ తెచ్చుకున్న ఈమెకు చిన్న పిల్లలలో కూడా ఫ్యాన్స్ ఉన్నారు.

తాజాగా ఒక పాప వీడియో నెట్టింట వైరల్ అవుతుంది.

ఒక పాపను పెద్దయ్యాక ఏమవుతావు అని ప్రశ్నించగా సమంత అని చెప్పి అందరికి షాక్ ఇస్తుంది.

ఈ వీడియోను స్వయంగా కీర్తి సురేష్ తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేసింది.ఈ వీడియో ప్రస్తుతం వైరల్ అవుతుంది.తన సినిమా షూటింగ్ సెట్స్ నుండి కీర్తి సురేష్ ఒక అందమైన సామ్ అభిమానిని పరిచయం చేసింది.ఈ పాప చాలా క్యూట్ గా ఉంది.

కీర్తి ఇంస్టాగ్రామ్ లో ఈ వీడియోను పంచుకుంది.ఈ వీడియోలో కీర్తి ఆ పాపను పెద్దయ్యాక నువ్వు ఏమవుతావు? అని కీర్తి ఆ పాపను అడిగింది.ఆ పాప వెంటనే సమంత అని చెప్పింది.ఆ పాప తాను సమంతకి వీరాభిమాని అని చెప్పింది.ఈ వీడియోను కీర్తి పంచుకుంటూ ‘సమంత.మీ అభిమాని.

మీరు ఆమెను తప్పకుండ ఒకసారి కల్సుకోవాలి” అని కోరింది.సమంత వెంటనే ఈ వీడియోకు రిప్లై ఇచ్చింది.

ఎవరు ఈ క్యూటీ అంటూ ప్రశ్నించింది సామ్.ఈ వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతుంది.

https://www.instagram.com/stories/keerthysureshofficial/2766166944320362950/

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube