అదేంటి కీర్తి.. సమంత గురించి అలా అనేసావ్?

టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోల మధ్య, హీరోయిన్ల మధ్య విపరీతమైన పోటీ ఉంటుంది.ఒక హీరోయిన్ ను మరో హీరోయిన్ ప్రశంసించటం అరుదుగా మాత్రమే జరుగుతుంది.

 Keerthy Suresh Interesting Comments About Samantha  Samantha, Ms India, Keerthi-TeluguStop.com

చాలా సందర్భాల్లో మరో హీరోయిన్ ను ప్రశంసించటానికి మన హీరోయిన్లకు మనసొప్పదు.అయితే స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్ మరో స్టార్ హీరోయిన్ సమంతపై ప్రశంసల వర్షం కురిపిస్తోంది.

కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో నటించిన మిస్ ఇండియా సినిమా 4వ తేదీన నెట్ ఫ్లిక్స్ లో విడుదలైన సంగతి తెలిసిందే.

ఈ సినిమాకు యావరేజ్ టాక్ రాగా కీర్తి సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొంటూ, అభిమానులతో చిట్ చాట్ చేస్తూ సినిమాపై ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచడానికి ప్రయత్నిస్తోంది.

ఈ మధ్య కాలంలో లేడీ ఓరియెంటెడ్ సినిమాల్లో ఎక్కువగా నటిస్తోన్న కీర్తి సురేష్ మహేష్ బాబు హీరోగా తెరకెక్కుతోన్న సర్కార్ వారి పాట సినిమాలో హీరోయిన్ గా ఎంపికైంది.ఒక నెటిజన్ సమంత గురించి ఏమైనా చెప్పాలని కోరగా కీర్తి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.

ప్రజంట్ జనరేషన్ హీరోయిన్లకు సమంత ప్రేరణ అని సమంత ఎప్పుడూ ప్రయోగాత్మక సినిమాలు చేస్తుంటుందని కీర్తి తెలిపారు.సమంత గురించి ఒక్కమాటలో చెప్పడం సాధ్యం కాదని.

ఆమె చాలా స్మార్ట్ అని అన్నారు.గతంలో కీర్తిసురేష్, సమంత మహానటి సినిమాలో నటించిన సంగతి తెలిసిందే.

కీర్తి మరో హీరోయిన్ సమంతపై ప్రశంసల వర్షం కురిపించడంతో సామ్ ఫ్యాన్స్ కీర్తి మాటలను వైరల్ చేస్తున్నారు.

మరోవైపు కీర్తి సురేష్ మహానటి సినిమా తరువాత కథల ఎంపికలో తప్పులు చేస్తోందని.

కథల ఎంపికలో జాగ్రత్త పడాలని చెబుతున్నారు.పాత్ర ఎంతో అద్భుతంగా ఉంటే తప్ప లేడీ ఓరియెంటెడ్ సినిమాల్లో నటించవద్దని సూచిస్తున్నారు.

లేడీ ఓరియెంటెడ్ కథలకు ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తే స్టార్ హీరోల సినిమాల్లో అవకాశాలు రావని చెబుతున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube