మరో బయోపిక్‌కు బుక్కయిన కీర్తి సురేష్..?  

Keerthy Suresh In Talks For Another Biopic, Keerthy Suresh, Mahanati, Tollywood News, Rang De, Sarkaru Vaari Paata - Telugu Keerthy Suresh, Mahanati, Rang De, Sarkaru Vaari Paata, Tollywood News

టాలీవుడ్‌లో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన అందాల భామ కీర్తి సురేష్ అతి తక్కువ సమయంలోనే స్టార్ స్టేటస్‌ను సొంతం చేసుకుంది.ఈ బ్యూటీ కెరీర్‌ను మలుపుతిప్పిన చిత్రంగా ‘మహానటి’నిలిచింది.

TeluguStop.com - Keerthy Suresh In Talks For Another Biopic

అలనాటి లెజెండరీ హీరోయిన్ సావిత్రి జీవితగాధను మహానటి చిత్రంతో మరోసారి ప్రేక్షకులముందుకు తీసుకొచ్చిన ఈ బ్యూటీ, తన పర్ఫార్మెన్స్‌తో ఏకంగా జాతీయ అవార్డును సొంతం చేసుకుంది.ఇక ఈ సినిమా ఇచ్చిన బూస్ట్‌తో వరుసగా సినిమాలు చేస్తూ దూసుకుపోతున్న కీర్తి సురేష్, ఇప్పుడు మరో బయోపిక్ చిత్రాన్ని తెరకెక్కించేందుకు రెడీ అవుతోంది.

తెలుగులో పేరొందిన ఓ స్టార్ హీరోయిన్ జీవితగాధను బయోపిక్ చిత్రంగా రూపొందించేందుకు పలువురు దర్శకనిర్మాతలు రెడీ అవుతున్నారు.ఈ సినిమాలో లీడ్ రోల్‌లో నటించేందుకు వారు కీర్తి సురేష్‌ను సంప్రదించినట్లు తెలుస్తోంది.

TeluguStop.com - మరో బయోపిక్‌కు బుక్కయిన కీర్తి సురేష్..-Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image

ఈ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు మరింత చేరువ అయ్యేందుకు కీర్తి సురేష్ రెడీ అవుతున్నట్లు చిత్ర వర్గాలు అంటున్నాయి.ఇక ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలను అతి త్వరలో ప్రకటించేందుకు చిత్ర యూనిట్ రెడ అవుతోంది.

అయితే ఈ సినిమా ఏ హీరోయిన్ జీవితం ఆధారంగా తెరకెక్కుతుందో అనే ఆసక్తి అప్పుడే ప్రేక్షకుల్లో మొదలైంది.

ఇక ప్రస్తుతం కీర్తి సురేష్ చేతిలో పలు సినిమాలు ఉన్నాయి.

ఇప్పటికే యంగ్ హీరో నితిన్ సరసన ‘రంగ్ దే’ అనే రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌ చిత్రంలో నటిస్తున్న కీర్తి సురేష్, సూపర్ స్టార్ మహేష్ బాబు సరసన ‘సర్కారు వారి పాట’లో కూడా హీరోయిన్‌గా నటించేందుకు రెడీ అవుతోంది.ఇక ఈ సినిమాలే కాకుండా తమిళంలో సూపర్ స్టార్ రజినీకాంత్ నటిస్తున్న ‘అన్నాత్తై’ చిత్రంలో కూడా కీర్తి సురేష్ నటిస్తోంది.

మొత్తానికి కీర్తి సురేష్ వరుసగా సినిమాలు చేస్తూ దూసుకుపోతుండటంతో ఆమె ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు.

#Mahanati #SarkaruVaari #Rang De #Keerthy Suresh

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Keerthy Suresh In Talks For Another Biopic Related Telugu News,Photos/Pics,Images..