రజనీకాంత్ తో జతకడుతున్న మహానటి  

Keerthy Suresh in Rajinikanth\'s \'Thalaivar 168 - Telugu Director Shiva, Keerthy Suresh, Kollywood, Rajinikanth\\'s, Thalaivar 168, Tollywood

మహానటి సినిమాతో టాలీవుడ్ లో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకున్న నటి కీర్తి సురేష్.నటిగా తన ప్రతిభ చూపించి సావిత్రిని మరోసారి గుర్తు చేసిందని తెలుగు ప్రేక్షకులందరి చేత కీర్తి సురేష్ మన్ననలు అందుకుంది.

Keerthy Suresh In Rajinikanth's 'thalaivar 168

ఇక ప్రస్తుతం ఈ భామ తెలుగులో రెండు సినిమాలకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.ఇదిలా ఉంటే ఇప్పుడు ఊహించని విధంగా కీర్తి సురేష్ మరో క్రేజీ ఆఫర్ ను సొంతం చేసుకుంది.

సూపర్ స్టార్ రజినీకాంత్ 168 చిత్రం మాస్ డైరెక్టర్ శివ దర్శకత్వంలో తెరకెక్కనుంది.ఈ సినిమాకు సంబంధించి ప్రీ ప్రొడక్షన్ పనులు ఇప్పటికే పూర్తి అయినట్లు తెలుస్తోంది.

త్వరలో సెట్స్పైకి వెళ్లబోతున్న ఈ సినిమాలో సీనియర్ హీరోయిన్ మీనా ఓ కీలక పాత్రలో నటిస్తున్నారు.

ఇదిలా ఉంటే ఈ సినిమాలో కీర్తి సురేష్ కూడా నటిస్తుందని సమాచారం బయటకు వచ్చింది.

తాజాగా ఈ విషయాన్ని తన ట్విట్టర్ ద్వారా కీర్తి సురేష్ కన్ఫర్మ్ చేసింది.నా జర్నీలో అద్భుతమైన మైలురాయికి సంబంధించిన వార్త మీతో పంచుకుంటున్నాను.చాలా సంతోషంగా ఉంది.రజనీ సార్ ని కలవడం గొప్ప అనుకుంటే ఆయనతో కలిసి నటించే అవకాశం వచ్చింది.

దీనిని నా జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేను.ఇది అద్భుతమైన జ్ఞాపకం అంటూ ట్వీట్ చేసింది.

దీంతో రజనీకాంత్ తో కీర్తి సురేష్ నటిస్తుందని వార్త నిజమని తేలింది.అయితే ఈ సినిమాలో కీర్తి సురేష్ రజనీకాంత్ కి జోడీగా నటిస్తుందా లేదంటే రజనీకాంత్ కూతురు పాత్రలో నటిస్తుందా అనేది తెలియాల్సి ఉంది.

#Keerthy Suresh #Kollywood #Thalaivar 168 #Director Shiva #Rajinikanth's

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Keerthy Suresh In Rajinikanth's 'thalaivar 168 Related Telugu News,Photos/Pics,Images..