కీర్తి సురేష్ పై భగ్గుమంటున్న అభిమానులు.. కారణమిదే..?  

keerthy suresh fans fire on her role vedalam remake, vedalam remake, keerthy suresh, chiranjeevi, sister role, keerthy suresh fans - Telugu Chiranjeevi, Keerthy Suresh, Keerthy Suresh Fans, Keerthy Suresh Fans Fire On Her Role Vedalam Remake, Sister Role, Vedalam Remake

సినిమా ఇండస్ట్రీలో ఏ హీరోయిన్ కైనా కెరీర్ ను మలుచుకునే తీరుపైనే భవిష్యత్ ఆధారపడి ఉంటుంది.అందం, అభినయం ఉన్న చాలామంది హీరోయిన్లకు సరైన అవకాశాలు రాకపోవడానికి కెరీర్ ను సరిగ్గా ప్లాన్ చేసుకోకపోవడమే అసలు కారణం.

TeluguStop.com - Keerthy Suresh Fans Fire On Her Role Vedalam Remake

ప్రస్తుతం కీర్తి సురేష్ కూడా అలాంటి తప్పే చేస్తేందని.కీర్తి చేయబోయే ఆ తప్పు వల్ల ఆమె కెరీర్ ప్రమాదంలో పడే అవకాశం ఉందంటూ ఆమె ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు.
కెరీర్ విషయంలో కీర్తి రాంగ్ స్టెప్ వేస్తోందని కీర్తి అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మెహర్ రమేష్ దర్శకత్వంలో చిరంజీవి హీరోగా వేదాళం రీమేక్ తెరకెక్కనున్న సంగతి తెలిసిందే.

ఈ సినిమాలో చిరంజీవి చెల్లెలి పాత్ర కోసం చిత్ర యూనిట్ సాయిపల్లవిని సంప్రదించగా ఆమె నటించడానికి ఇష్టపడలేదు.అయితే అదే పాత్రలో నటించడానికి కీర్తి సురేష్ అంగీకరించినట్టు తెలుస్తోంది.

TeluguStop.com - కీర్తి సురేష్ పై భగ్గుమంటున్న అభిమానులు.. కారణమిదే..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image

అయితే కీర్తి ఆ సినిమాలో నటిస్తే మాత్రం హీరోయిన్ గా అవకాశాలు తగ్గుతాయని ఫ్యాన్స్ ఫీల్ అవుతున్నారు.

టాలీవుడ్, కోలీవుడ్ ఇండస్ట్రీలలో వరుస అవకాశాలతో కీర్తి సురేష్ బిజీగా ఉంది.

మహేష్ బాబుతో కలిసి సర్కార్ వారి పాట సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది.ఈ సినిమా సక్సెస్ అయితే స్టార్ హీరోల సరసన మరిన్ని అవకాశాలు వస్తాయి.

అయితే ఇలాంటి సమయంలో చెల్లి పాత్రలు పోషిస్తే ఆ సినిమా హిట్టైనా స్టార్ హీరోలు ఆమెను హీరోయిన్ గా తీసుకోవడానికి మొగ్గు చూపరు.
చిరంజీవికి చెల్లి పాత్రలో నటించినా ఆ పాత్ర వల్ల కీర్తికి పెద్దగా ప్రయోజనం చేకూరదు.

మరి ఫ్యాన్స్ ఫైర్ అవుతున్న నేపథ్యంలో కీర్తి సురేష్ ఈ పాత్ర విషయంలో ఏ విధంగా ముందుకెళుతుందో చూడాల్సి ఉంది.వేదాళం రీమేక్ విషయంలో ఆమె తీసుకునే నిర్ణయంపైనే కీర్తి సురేష్ భవిష్యత్ ఆధారపడి ఉంటుంది.

#Keerthy Suresh #KeerthySuresh #Vedalam Remake #Chiranjeevi #KeerthySuresh

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Keerthy Suresh Fans Fire On Her Role Vedalam Remake Related Telugu News,Photos/Pics,Images..