ఆలు లేదు సూలు లేదన్నట్లుంది 'ఆదిపురుష్‌' పరిస్థితి

యంగ్‌ రెబల్‌ స్టార్‌ ప్రభాస్‌ బాలీవుడ్‌ స్టార్‌ ఫిల్మ్‌ మేకర్‌ ఓంరౌత్‌ల కాంబినేషన్‌ లో రూపొందబోతున్న ఇండియాస్‌ బిగ్గెస్ట్‌ చిత్రం ‘ఆదిపురుష్‌‘.ప్రభాస్‌ రాముడిగా నటించబోతున్న ఈ చిత్రంకు సంబంధించిన వార్తలు ప్రస్తుతం మీడియాను ముంచెత్తుతున్న విషయం తెల్సిందే.

 Keerthy Suresh Denies Rumors Adi Purush, Prabhas, Adi Purush, Keerthy Suresh, Sa-TeluguStop.com

ఎప్పుడైతే ప్రభాస్‌ సినిమాను ప్రకటించాడో అప్పటి నుండి కూడా సినిమా గురించిన చర్చ మీడియాలో జోరుగా సాగుతూనే ఉంది.సినిమా బడ్జెట్‌, హీరోయిన్‌, విలన్‌, విడుదల, వసూళ్లు ఇలా ఎన్నో రకాలుగా ప్రచారాలు అయితే జరుగుతూనే ఉన్నాయి.

ముఖ్యంగా హీరోయిన్‌ మరియు విలన్‌ ల విషయంలో ప్రచారం జోరుగా సాగుతోంది.సినిమా ప్రకటన వచ్చిన రోజునే సీత పాత్రలో కీర్తి సురేష్‌ నటించబోతున్నట్లుగా వార్తలు వచ్చాయి.

ఇటీవల ఆమె ఆ వార్తలను కొట్టి పారేసింది.తనను ఆ పాత్ర కోసం ఎవరు సంప్రదించలేదు అంటూ క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసింది.

ఇక విలన్‌ విషయంలో కూడా పెద్ద ఎత్తున చర్చ మొదలైంది.బాలీవుడ్‌ స్టార్‌ నటుడు సైఫ్‌ అలీ ఖాన్‌ ను ఈ సినిమా కోసం ఎంపిక చేసినట్లుగా ప్రచారం జరుగుతోంది.

Telugu Aadipurush, Adi Purush, Keerthi Suresh, Keerthy Suresh, Keerthysuresh, Om

కీర్తి సురేష్‌ తనను సంప్రదించలేదు అంటూ క్లారిటీ ఇచ్చింది.కాని ఇప్పటి వరకు సైఫ్‌ అలీ ఖాన్‌ మాత్రం స్పందించలేదు.ఈ సినిమాలో ఆయన రావణుడి పాత్ర పోషిస్తున్నాడు అంటున్నారు.అదే కనుక నిజం అయితే బాలీవుడ్‌ ప్రేక్షకులు ఈ సినిమాను మరింత ఓన్‌ చేసుకునే అవకాశం ఉందని కూడా అంటున్నారు.

మొత్తానికి ఇంకా ఏం లేకుండానే భారీగా ప్రచారం అయితే చేస్తున్నారు.దీనిని చూస్తుంటే ఆలు లేదు సూలు లేదు అన్న సామెత గుర్తుకు వస్తుందని కామెంట్స్‌ వినిపిస్తున్నాయి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube