కీర్తి సురేష్‌ బిస్కెట్‌ వేసిందిగా!       2018-06-22   00:58:40  IST  Raghu V

‘నేను శైలజ’ చిత్రంతో హీరోయిన్‌గా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన కీర్తి సురేష్‌ ఆ తర్వాత చేసిన తెలుగు చిత్రాలతో స్టార్‌ హీరోయిన్‌గా గుర్తింపు దక్కించుకుంది. ఆ సమయంలోనే అజ్ఞాతవాసి చిత్రంలో నటించింది. పవన్‌తో నటించిన అజ్ఞాతవాసి పెద్దగా ఆడకపోయినా కూడా కీర్తి సురేష్‌కు మాత్రం మంచి క్రేజ్‌ వచ్చిందని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. కీర్తి సురేష్‌ ఆ సమయంలోనే మహానటి చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సావిత్రి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన మహానటి చిత్రంలో సావిత్రి పాత్రను కీర్తి సురేష్‌ పోషించింది. సావిత్రి పాత్రకు జీవం పోసి, నిజంగా మహానటిని దించేసింది. ఇంతటి అద్బుతమైన నటనతో ఆకట్టుకున్న కీర్తి సురేష్‌కు తెలుగులో ఆఫర్లు రావడం లేదు.

-

తెలుగులో ప్రేక్షకులు కీర్తి సురేష్‌ను మహానటిగానే చూస్తున్నారు. ఈ సమయంలో కీర్తి సురేష్‌ గ్లామర్‌ రోల్స్‌తో ముందుకు వస్తాను అంటే ప్రేక్షకులు ఒప్పుకోరు. కొంత కాలం వరకు కీర్తి సురేష్‌ను మహానటిగానే ప్రేక్షకులు ఊహించుకుంటూ ఉంటారు. అందుకే ఆమెను హీరోలు తమ సినిమాల్లో నటింపజేసేందుకు ఆసక్తి చూపడం లేదు. ఆ కారణంగానే ఈ అమ్మడు తెలుగు సినిమాకు ఇప్పటి వరకు కమిట్‌ కాలేదు. ప్రస్తుతం కీర్తి సురేష్‌ చేతిలో ఒక్కటి అంటే ఒక్కటి కూడా తెలుగు సినిమా లేదు. ఈ విషయంపై కీర్తి సురేష్‌ మరియు ఆమె సన్నిహితులు కాస్త విభిన్నంగా స్పందిస్తూ కవర్‌ చేసే ప్రయత్నం చేస్తున్నారు.

తెలుగులో వరుసగా ఆఫర్లు వస్తున్నప్పటికి తానే కావాలని తెలుగు సినిమాలను వదులుకుంటున్నాను అని, తమిళంలో మూడు పెద్ద చిత్రాలు చేస్తున్న కారణంగా డేట్లు ఇచ్చే పరిస్థితి లేదని, ఆరు నెలల వరకు తాను కనీసం కొత్త సినిమాను ఒప్పుకునే పరిస్థితి లేదంటూ కీర్తి సురేష్‌ చెప్పుకొచ్చింది. తెలుగులో ఈ అమ్మడు డేట్లు ఖాళీ లేక చేయడం లేదని చెబుతుంది. కాని అసు విషయం మాత్రం అందరికి తెలుసు అంటూ సినీ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. తెలుగు సినిమాల్లో కీర్తికి ఇప్పట్లో అవకాశం రావడం కష్టమే.

తమిళంలో ఎంత పెద్ద స్టార్స్‌ సరసన నటించినా కూడా ఈమెకు మరీ అంత తీరిక లేకుండా ఏమీ ఉండదని, తెలుగులో ఆమెకు ఆఫర్లు రాకపోవడం వల్లే అలా బిస్కెట్‌ వేస్తుందంటూ కొందరు సినీ విశ్లేషకులు మరియు సినీ వర్గాల వారు అంటున్నారు. కీర్తి సురేష్‌ మంచి నటి అయినప్పటికి ఆమె స్కిన్‌ షోకు ఓకే చెప్పక పోవడంతో పాటు, గ్లామర్‌గా నటించేందుకు నో చెబుతుంది. ఆ కారణం వల్ల కూడా కీర్తికి తెలుగులో ఆఫర్లు రాకపోవచ్చు అనే ఊహాగాణాలు వినిపిస్తున్నాయి.

ప్రకటన : తెలుగుస్టాప్ వెబ్ సైట్ లో పని చేయుట కొరకు అనుభవజ్ఞులైన తెలుగు కంటెంట్ రచయితలు,రాజకీయ విశ్లేషకులు,సోషల్ మీడియా ఫొటోస్/వీడియోస్ అడ్మిన్స్,వీడియో ఎడిటర్,వీడియో మేకర్స్,లైవ్ రిపోర్టర్ లు కావలెను..మీ వివరాలను telugustop@gmail.com కు మెయిల్ చేయగలరు.