మహేష్ అభిమానులకు మహానటి టెన్షన్.. సర్కారు వారి పాట హిట్టవుతుందా?

సినిమా రంగంలో వరుసగా విజయాలు సాధిస్తే గోల్డెన్ లెగ్ అని వరుసగా ఫ్లాప్స్ వస్తే ఐరన్ లెగ్ అని పిలుస్తారు.గత కొన్నేళ్లుగా కీర్తి సురేష్ కు తెలుగులో లక్ కలిసిరావడం లేదు.

 Keerthy Suresh Bad Sentiment Tension For Star Hero Mahesh Babu Fans , Bad Sentiment , Interesting Facts , Keerthy Suresh , Mahesh Fans , Sarkaru Vari Pata , Mahesh Babu , Good Luck Sakhi-TeluguStop.com

మహానటి సినిమాతో కీర్తి సురేష్ సంచలన విజయాన్ని సొంతం చేసుకోగా ఆ తర్వాత కీర్తి సురేష్ నటించిన లేడీ ఓరియెంటెడ్ సినిమాలన్నీ బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్ అయ్యాయి.తాజాగా ఆమె నటించిన గుడ్ లక్ సఖి థియేటర్లలో విడుదలైంది.

అయితే ఈ సినిమాకు నెగిటివ్ రివ్యూలు రావడంతో పాటు ప్రేక్షకులు సైతం ఈ సినిమాపై నెగిటివ్ కామెంట్లు చేస్తున్నారు.గుడ్ లక్ సఖి సినిమాతో కీర్తి సురేష్ ఖాతాలో మరో ఫ్లాప్ చేరింది.

 Keerthy Suresh Bad Sentiment Tension For Star Hero Mahesh Babu Fans , Bad Sentiment , Interesting Facts , Keerthy Suresh , Mahesh Fans , Sarkaru Vari Pata , Mahesh Babu , Good Luck Sakhi -మహేష్ అభిమానులకు మహానటి టెన్షన్.. సర్కారు వారి పాట హిట్టవుతుందా-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అయితే ఈ సినిమా రిజల్ట్ వల్ల మహేష్ బాబు అభిమానులు తెగ టెన్షన్ పడుతున్నారు.గత కొన్నేళ్లుగా మహేష్ బాబు ఖాతాలో ఫ్లాప్ లేదు.

వరుసగా మహేష్ బాబు విజయాలను సొంతం చేసుకుంటున్నారు.ప్రస్తుతం మహేష్ సర్కారు వారి పాట మూవీలో నటిస్తుండగా మహేష్ కు జోడీగా కీర్తి సురేష్ నటిస్తున్నారు.

Telugu Bad, Luck Sakhi, Keerthy Suresh, Mahesh Babu, Mahesh Fans-Movie

మరోవైపు కీర్తి సురేష్ కథల విషయంలో పొరపాట్లు చేస్తున్నారని అందువల్లే ఆమె నటిస్తున్న సినిమాలు ఫ్లాప్ అవుతున్నాయని కామెంట్లు వినిపిస్తున్నాయి.విజయ్ తో కీర్తి సురేష్ కలిసి నటించిన సర్కార్ మినహా ఆమె నటించిన పెద్ద సినిమాలన్నీ బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్ అయ్యాయి.పవన్ కు జోడీగా కీర్తి సురేష్ నటించిన అజ్ఞాతవాసి సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా నిలిచిన సంగతి తెలిసిందే.

సర్కారు వారి పాట సినిమాతో కీర్తి సురేష్ సక్సెస్ సాధించాలని సర్కారు వారి పాట బ్లాక్ బస్టర్ హిట్ కావాలని కీర్తి అభిమానులు కోరుకుంటున్నారు.తెలుగులో కీర్తి సురేష్ దసరా, భోళా శంకర్ సినిమాలలో నటిస్తున్నారు.కీర్తి సురేష్ కు ఇతర ఇండస్ట్రీలలో కూడా సినిమా ఆఫర్లు వస్తుండటం గమనార్హం.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube