ఆది పురుష్ లో సీతగా కీర్తి సురేష్..?

తెలుగు ముద్దుగుమ్మ మహానటి ఫేమ్ కీర్తి సురేష్ గురించి అందరికీ తెలిసిందే.తన అందంతో, నటనతో బాగా మెప్పించి వరుస ఆఫర్లతో దూసుకుపోతుంది.

 Keerthy Suresh As Sita For Adipurush-TeluguStop.com

స్టార్ హీరోల సరసన నటించి మంచి క్రేజ్ ను సొంతం చేసుకుంది.తన పాత్రలు ఎంతో హోమ్లీగా ఉండటమే కాకుండా తన నటన కూడా అంతే హోమ్లీ గా ఉంటుంది.

కీర్తి సురేష్ కు ఎంతో మంది అభిమానులు ఉన్నారు.

 Keerthy Suresh As Sita For Adipurush-ఆది పురుష్ లో సీతగా కీర్తి సురేష్..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

బాలనటిగా వెండితెరకు పరిచయం అయిన ఈ బ్యూటీ.

తర్వాత తమిళ సిని పరిశ్రమలో అడుగుపెట్టింది.అంతేకాకుండా 2016 లో హీరో రామ్ నటించిన నేను శైలజ సినిమా లో హీరోయిన్ గా తొలిసారిగా పరిచయమైంది.

ఆ సినిమాలో ఆమె నటనకు ఎంతో గుర్తింపు పొందిన తర్వాత వరుస ఆఫర్ లను సొంతం చేసుకుంది.ఆ తర్వాత ఆమె మహానటి సావిత్రి జీవిత చరిత్ర గురించి తెరకెక్కిన మహానటి సినిమాలో నటించింది.

ఈ సినిమాలో కీర్తి సురేష్ నట‌న గురించి ఎంతగానో ఆకట్టుకుంది.తాజాగా మరో ఫాన్ ఇండియా సినిమా లో కీర్తి సురేష్ కు క్రేజీ అవకాశం వచ్చింది.

ఇదిలా ఉంటే ప్రస్తుతం మహేష్ బాబు నటిస్తున్న సర్కారు వారి పాట సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది.ప్రస్తుతం ప్రభాస్ నటిస్తున్న ఫాన్ ఇండియా సినిమా ‘ఆది పురుష్‘.ఈ సినిమాకు బాలీవుడ్ స్టార్ దర్శకుడు ఓం రౌత్ దర్శకత్వం వహిస్తున్నాడు.ఈ సినిమా రామాయణం నేపథ్యంలో తెరకెక్కనుంది.

ఇందులో బాలీవుడ్ హీరో సైఫ్ అలీ ఖాన్ లంకేష్ పాత్రలో కనిపించనున్నాడు.ఇందులో ప్రభాస్ రాముడిగా కనిపించనుండగా, ప్రభాస్ సరసన నటించే సీత పాత్ర గురించి ఎవరు నటిస్తున్నారని చాలా రోజుల నుండి వార్తలు వినిపిస్తున్నాయి.

తాజాగా సీత పాత్రలో కీర్తి సురేష్ నటిస్తుందని తెలుస్తుంది.అంతేకాకుండా ఆమెతో చర్చలు జరిపారని త్వరలో అధికారిక ప్రకటన చేయనున్నారని తెలిపారు.

మొత్తానికి మహానటి సీత పాత్రలో మెరవనుంది.

#Keerthy Suresh #Prabhas #AdiPurush #Sita #Pan India Movie

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు