చిరుకు చెల్లెలు దొరికిందోచ్.. ఎవరో తెలుసా?  

Keerthy Suresh As Chiranjeevi Sister, Keerthy Suresh, Chiranjeevi, Vedhalam, Remake, Meher Ramesh - Telugu Chiranjeevi, Keerthy Suresh, Meher Ramesh, Remake, Vedhalam

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘ఆచార్య’ ఇప్పటికే సగం షూటింగ్ పూర్తి చేసుకుంది.కరోనా కారణంగా షూటింగ్ వాయిదా వేసుకున్న ఆచార్య, తిరిగి ప్రారంభించేందుకు రెడీ అవుతున్నాడు.

TeluguStop.com - Keerthy Suresh As Chiranjeevi Sister

కాగా ఈ సినిమా ఇంకా పూర్తిగాక ముందే చిరు తన నెక్ట్స్ చిత్రాలను ఓకే చేస్తూ స్పీడుమీదున్నాడు.ఈ క్రమంలో ఇప్పటికే వివి వినాయక్ దర్శకత్వంలో ‘లూసిఫర్’ చిత్ర రీమేక్‌ను తెరకెక్కించేందుకు చిరు రెడీ అవుతున్నాడు.

కాగా అందరినీ అవాక్కయ్యేలా చేస్తూ మెహర్ రమేష్ డైరెక్షన్‌లో తమిళ సూపర్ హిట్ చిత్రం ‘వేదాళం’ను తెలుగులో రీమేక్ చేసేందుకు చిరు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.

TeluguStop.com - చిరుకు చెల్లెలు దొరికిందోచ్.. ఎవరో తెలుసా-Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image

అయితే ఈ సినిమాలో చిరు సోదరి పాత్ర చాలా కీలకంగా ఉండనుండటంతో ఈ పాత్రలో ఎవరు నటిస్తారా అనే అంశం చాలా ఆసక్తికరంగా మారింది.

ఇప్పటికే ఈ పాత్రలో నటిస్తున్నట్లు అందాల భామ సాయి పల్లవి పేరు గట్టిగా వినిపించింది.అయితే ఆమె ఈ సినిమాలో నటిస్తుందనే వార్త కేవలం పుకారే అని తేలిపోయింది.

దీంతో ఇప్పుడు ఈ పాత్రలో ఎవరు నటిస్తున్నారా అని మెగా ఫ్యాన్స్‌తో పాటు ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.అయితే చిరు సోదరి పాత్రలో మరో బ్యూటీ, మహానటి చిత్ర హీరోయిన్ కీర్తి సురేష్ నటిస్తున్నట్లు ఇండస్ట్రీ వర్గాల్లో వార్త వినిపిస్తోంది.

ఇటీవల వరుసబెట్టి సినిమాలు చేస్తున్న కీర్తి సురేష్, ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబు సరసన ‘సర్కారు వారి పాట’ చిత్రంలో నటిస్తున్న ఈ బ్యూటీ, ఇలా చిరు సోదరి పాత్రలో నటిస్తుందనే వార్త ప్రస్తుతం టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది.ఇక ఈ సినిమా షూటింగ్‌ను అతి త్వరలో ప్రారంభించేందుకు మెహర్ రమేష్ ఫ్లాన్ చేస్తున్నాడు.

కాగా ఈ సినిమాలో చిరు స్టైలిష్ లుక్‌లో కనిపించనున్నట్లు తెలుస్తోంది.మరి ఈ సినిమాలో కీర్తి సురేష్ నటిస్తుందనే వార్త నిజమా లేక ఇది కూడా పుకారేనా అనేది తెలియాల్సి ఉంది.

#Chiranjeevi #Vedhalam #Keerthy Suresh #Remake #Meher Ramesh

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Keerthy Suresh As Chiranjeevi Sister Related Telugu News,Photos/Pics,Images..