మ్యూజిక్ డైరెక్టర్ తో నైట్ పార్టీలో రచ్చ చేసిన కీర్తి సురేష్?  

keerthy suresh and anirudh ravichander photos goes viral in social meida Keerthy Suresh, Anirudh Ravichandran, Menaka, Keerthi Suresh Birthday, Twitter , Sarkaru Vari Pata, Mahesh Babu - Telugu @keerthyofficial, Anirudh Ravichandran, Keerthy Suresh, Mahesh Babu, Sarkaru Vari Pata, Twitter

చేసింది తక్కువ సినిమాలే అయినా టాలీవుడ్, కోలీవుడ్ ఇండస్ట్రీలలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్లలో కీర్తి సురేష్ ఒకరు.నటి మేనక కుమార్తె అయిన కీర్తి సురేష్ బాల నటిగా కొన్ని సినిమాల్లో నటించగా గీతాంజలి అనే మలయాళ సినిమాతో 2013లో హీరోయిన్ గా కెరీర్ మొదలుపెట్టారు.

TeluguStop.com - Keerthy Suresh And Anirudh Ravichander Photos Goes Viral

ఆ తరువాత తమిళం, తెలుగు ఇండస్ట్రీలలో వరుస విజయాలతో స్టార్ హీరోయిన్ గా తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నారు.

నాగ్ అశ్విన్ దర్శకత్వంలో కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన మహానటి సినిమా నటిగా కీర్తి సురేష్ కు పేరు, గుర్తింపు తెచ్చిపెట్టింది.

TeluguStop.com - మ్యూజిక్ డైరెక్టర్ తో నైట్ పార్టీలో రచ్చ చేసిన కీర్తి సురేష్-Latest News - Telugu-Telugu Tollywood Photo Image

గ్లామరస్ రోల్స్ కు దూరంగా ఉంటూ అభినయానికి ప్రాధాన్యత ఉన్న పాత్రలనే కీర్తి సురేష్ ఎక్కువగా ఎంచుకుంటోంది.నేడు కీర్తి సురేష్ పుట్టినరోజు.

ఈరోజు ఆమె 28వ పుట్టినరోజును జరుపుకుంటుంది.నిన్న కోలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ పుట్టినరోజు కాగా కీర్తి అనిరుధ్ కు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలిపారు.

నిన్న అనిరుధ్ బర్త్ డే పార్టీలో కీర్తి సురేష్ పాల్గొన్నారు.నైట్ పార్టీలో వీళ్లు రచ్చ చేశారు.పార్టీలో కీర్తి, అనిరుధ్ కలిసి దిగిన ఫోటోలను కీర్తి సురేష్ సోషల్ మీడియాలో షేర్ చేశారు.గతంలో బొద్దుగా కనిపించిన కీర్తి సురేష్ ప్రస్తుతం ఫోటోల్లో సన్నగా కనిపిస్తూ కొత్త లుక్ తో ఆకట్టుకుంటోంది.

కీర్తి సురేష్ ట్విట్టర్ ద్వారా షేర్ చేసిన ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.సోషల్ మీడియా వేదికగా కీర్తి సురేష్ కు పుట్టినరోజు సందర్భంగా ఆమె అభిమానులు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

మరోవైపు పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సర్కార్ వారి పాట సినిమాలో కీర్తి సురేష్ కు హీరోయిన్ గా అవకాశం దక్కింది.ఈ మేరకు చిత్ర యూనిట్ నుంచి అధికారిక ప్రకటన వెలువడింది.

ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్‌, మైత్రీ మూవీ మేకర్స్, మహేష్ బాబు ఈ సినిమాను సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

#Twitter #Keerthy Suresh #Mahesh Babu

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Keerthy Suresh And Anirudh Ravichander Photos Goes Viral Related Telugu News,Photos/Pics,Images..