మహానటి చిత్రంతో తెలుగు ప్రేక్షకులు చాలా దగ్గరయ్యింది అందాల భామ కీర్తి సురేష్.ఈ ఒక్క సినిమాతో అమ్మడి క్రేజ్ మరో స్థాయికి వెళ్లిపోయింది.
ఈ సినిమాతో ఆమె నటన పరంగా మెప్పించడంతో పాటు పలు అవార్డులు కూడా సొంతం చేసుకుంది.ఇక ఈ బ్యూటీ ప్రస్తుతం చేతినిండా సినిమాలతో ఫుల్ బిజీగా మారింది.
అయితే సూపర్ స్టార్ మహేష్ బాబు నటించబోయే సినిమాలో అమ్మడిని తీసుకుంటున్నారనే వార్త ప్రస్తుతం ఇండస్ట్రీలో తెగ హల్చల్ చేస్తోంది.కాగా కోలీవుడ్లో మాత్రం అమ్మడికి పెళ్లి సమయం దగ్గర పడిందనే వార్త హల్చల్ చేస్తోంది.
కీర్తి సురేష్ తండ్రి సురేష్ కుమార్ ఈ మేరకు ఏర్పాట్లు కూడా చేస్తున్నాడట.ఓ బిజినెస్మాన్తో కీర్తి సురేష్ వివాహం త్వరలో జరగనున్నట్లు తెలుస్తోంది.
దీని కోసం ఇరు వర్గాల కుటుంబాలు కూడా ఒప్పుకున్నట్లు తెలుస్తోంది.
మరి కీర్తి సురేష్ పెళ్లి వార్తలో ఎంతవరకు నిజం ఉందో తెలియదు కానీ, ఆమె ఫ్యాన్స్ మాత్రం చాలా ఫీల్ అవుతున్నారట.
ఇప్పుడిప్పుడే ఆమె మంచి సినిమాలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటోందని, అంతలోనే ఆమె పెళ్లి చేసుకుంటే ఎలా అని వారు ఫీలవుతున్నారు.