'బంగార్రాజు' పుకార్లే పుకార్లు... ఈసారి కీర్తిసురేష్‌ వంతు  

Keerthi Suresh To Act In Bangarraju With Nagachaitanya-

నాగార్జున రెండు సంవత్సరాల క్రితం నటించిన ‘సోగ్గాడే చిన్ని నాయనో’ చిత్రంలో బంగార్రాజు పాత్ర మంచి సక్సెస్‌ అయిన విషయం తెల్సిందే.బంగార్రాజు పాత్రను బేస్‌ చేసుకుని కథను సిద్దం చేస్తే అదే టైటిల్‌తో సినిమా చేద్దాం అంటూ దర్శకుడు కళ్యాణ్‌ కృష్ణకు నాగార్జున రెండేళ్ల క్రితమే చెప్పాడు.చాలా వర్షన్‌ల కథలను సిద్దం చేసిన తర్వాత నాగార్జున ఎట్టకేలకు బంగార్రాజు కథకు ఓకే చెప్పాడు.

Keerthi Suresh To Act In Bangarraju With Nagachaitanya--Keerthi Suresh To Act In Bangarraju With Nagachaitanya-

త్వరలోనే సినిమా ప్రారంభం కాబోతుంది.

Keerthi Suresh To Act In Bangarraju With Nagachaitanya--Keerthi Suresh To Act In Bangarraju With Nagachaitanya-

నాగార్జున సొంతంగా నిర్మించబోతున్న బంగార్రాజు గురించిన వార్తలు ప్రతి రోజు ఏదో ఒకటి వస్తూనే ఉంది.ఈ చిత్రంలో నాగార్జున వృద్దుడిగా కనిపించబోతున్నాడని, అఖిల్‌ ఆయనకు మనవడి పాత్రలో కనిపించబోతున్నాడు అంటూ వార్తలు వచ్చాయి.అయితే ఆ వార్తలు నిజం కాదని నాగార్జున వృద్దుడి పాత్ర నిజమే కాని మనవడి పాత్రలో నాగచైతన్య కనిపించబోతున్నట్లుగా ప్రచారం జరిగింది.

చైతూ కూడా ఆ విషయాన్ని సూచాయిగా ఒప్పుకున్నాడు.ఇక తాజాగా హీరోయిన్స్‌ విషయంలో రచ్చ జరుగుతోంది.

బంగార్రాజు సినిమాను నాగార్జున నిర్మిస్తున్న కారణంగా మంచి క్రేజ్‌ రావాలనే ఉద్దేశ్యంతో నాగచైతన్యకు జోడీగా సమంతను ఎంపిక చేసేందుకు ప్రయత్నాలు జరిగాయని మొన్నటికి మొన్న వార్తలు వచ్చాయి.ఆ తర్వాత మరో హీరోయిన్‌ పేరు ప్రచారం జరిగింది.ఇప్పుడు కీర్తి సురేష్‌ వంతు వచ్చింది.తమిళం మరియు తెలుగులో స్టార్‌ డంతో దూసుకు పోతున్న కీర్తి సురేష్‌ను నాగచైతన్యకు జోడీగా ఎంపిక చేసినట్లుగా తెలుస్తోంది.ఇంకా సినిమా గురించి ఎలాంటి క్లారిటీ లేకుండానే పుకార్లు పెద్ద ఎత్తున షికార్లు చేస్తున్నాయి.

ప్రస్తుతం మన్మధుడు 2 తో బిజీగా ఉన్న నాగార్జున ఆ తర్వాత బిగ్‌బాస్‌ను హోస్ట్‌ చేయబోతున్నాడు.అదే సమయంలో బంగార్రాజును మొదలు పెట్టే అవకాశం ఉంది.