తేజ సినిమాకు ఓకే చెప్పిన మహానటి  

Keerthi Suresh Ok For Teja Movie, Mahanati, Keerthi Suresh, Mahesh Babu, Sarkaru Vari Pata, Teja, Gopichandh, - Telugu Gopichandh, Keerthi Suresh, Mahanati, Mahesh Babu, Sarkaru Vari Pata, Teja

మహానటి చిత్రం తర్వాత కీర్తి సురేష్‌ స్టార్‌డం ఒకేసారి పెరిగింది.అద్బుతమైన నటనతో పాటు అందం కూడా కలిగి ఉన్న కీర్తి సురేష్‌కు ఈమద్య కాలంలో వరుసగా ఆఫర్లు వస్తున్నాయి.

 Keerthi Suresh Teja Gopichandh

కేవలం తెలుగులో మాత్రమే కాకుండా తమిళం హిందీల్లో కూడా ఆమె బిజీ నటిగా మారిపోయింది.తాజాగా ఈమె మహేష్‌బాబు సర్కారు వారి పాట చిత్రంకు కమిట్‌ అయ్యింది.

ఆ సినిమా ఇంకా ప్రారంభం కాకుండానే మరో సినిమాలో కూడా కీర్తి సురేష్‌ నటించబోతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి.

తేజ సినిమాకు ఓకే చెప్పిన మహానటి-Movie-Telugu Tollywood Photo Image

తేజ దర్శకత్వంలో అలివేలుమంగ వెంకటరమణ అనే చిత్రం రూపొందబోతుంది.

ఆ చిత్రంలో గోపీచంద్‌ హీరోగా నటించబోతున్నాడు.ఈ చిత్రంలో హీరో పాత్ర కంటే హీరోయిన్‌ పాత్రకు ఎక్కువ ప్రాముఖ్యత ఉందట.

దాంతో సినిమా బడ్జెట్‌ పెరుగుతుందనే విషయాన్ని పట్టించుకోకుండా దర్శకుడు తేజ ఈ చిత్రంలో కీర్తి సురేష్‌ ను నటింపజేయాలని నిర్ణయించుకున్నాడు.అందుకు సంబంధించిన చర్చలు కూడా జరుగుతున్నాయి.

కేవలం 40 రోజుల డేట్లు ఇస్తే సరిపోతుందని, భారీ పారితోషికంను తేజ ఆఫర్‌ చేశాడట.దాంతో కీర్తి సురేష్‌ మరో ఆలోచన లేకుండా ఆ చిత్రంకు ఓకే చెప్పిందని టాక్‌ వినిపిస్తుంది.గోపీచంద్‌ కీర్తి సురేష్‌ల కాంబోపై అంచనాలు భారీగా ఉన్నాయి.అంచనాలకు తగ్గట్లుగా ఈ చిత్రం ఉంటుందా అనేది చూడాలి.వచ్చే ఏడాదిలో సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది.

Keerthi Suresh Ok For Teja Movie, Mahanati, Keerthi Suresh, Mahesh Babu, Sarkaru Vari Pata, Teja, Gopichandh, - Telugu Gopichandh, Keerthi Suresh, Mahanati, Mahesh Babu, Sarkaru Vari Pata, Teja

Suresh rose to fame after the movie at the same time mahanati Stardom.Kirti Suresh, who has a stellar performance as well as beauty, has been getting offers in a row in recent times..She has become a busy actress not only in Telugu but also in Tamil and Hindi.Recently, Maheshbabu Sarkar committed to their song film.The news is coming that Kirti Suresh is going to act in another film besides the beginning of that movie. Alivelumanga Venkataramana is going to be made under the direction of Teja.Gopichand is going to play the hero in that film.The role of the heroine is more important than the role of the hero in this film.Director Teja decided to cast Kirti Suresh in the film, despite the fact that the film's budget would increase..Negotiations are also underway.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Keerthi Suresh Teja Gopichandh Related Telugu News,Photos/Pics,Images..