మహానటి చిత్రం తర్వాత కీర్తి సురేష్ స్టార్డం ఒకేసారి పెరిగింది.అద్బుతమైన నటనతో పాటు అందం కూడా కలిగి ఉన్న కీర్తి సురేష్‌కు ఈమద్య కాలంలో వరుసగా ఆఫర్లు వస్తున్నాయి.
కేవలం తెలుగులో మాత్రమే కాకుండా తమిళం హిందీల్లో కూడా ఆమె బిజీ నటిగా మారిపోయింది.తాజాగా ఈమె మహేష్‌బాబు సర్కారు వారి పాట చిత్రంకు కమిట్ అయ్యింది.
ఆ సినిమా ఇంకా ప్రారంభం కాకుండానే మరో సినిమాలో కూడా కీర్తి సురేష్ నటించబోతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి.
తేజ దర్శకత్వంలో అలివేలుమంగ వెంకటరమణ అనే చిత్రం రూపొందబోతుంది.
ఆ చిత్రంలో గోపీచంద్ హీరోగా నటించబోతున్నాడు.ఈ చిత్రంలో హీరో పాత్ర కంటే హీరోయిన్ పాత్రకు ఎక్కువ ప్రాముఖ్యత ఉందట.
దాంతో సినిమా బడ్జెట్ పెరుగుతుందనే విషయాన్ని పట్టించుకోకుండా దర్శకుడు తేజ ఈ చిత్రంలో కీర్తి సురేష్ ను నటింపజేయాలని నిర్ణయించుకున్నాడు.అందుకు సంబంధించిన చర్చలు కూడా జరుగుతున్నాయి.

కేవలం 40 రోజుల డేట్లు ఇస్తే సరిపోతుందని, భారీ పారితోషికంను తేజ ఆఫర్ చేశాడట.దాంతో కీర్తి సురేష్ మరో ఆలోచన లేకుండా ఆ చిత్రంకు ఓకే చెప్పిందని టాక్ వినిపిస్తుంది.గోపీచంద్ కీర్తి సురేష్‌ల కాంబోపై అంచనాలు భారీగా ఉన్నాయి.అంచనాలకు తగ్గట్లుగా ఈ చిత్రం ఉంటుందా అనేది చూడాలి.వచ్చే ఏడాదిలో సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది.