జీరో సైజుతో క్యూట్ గా మారిన మహానటి! బాలీవుడ్ సినిమా కోసమేనా  

స్లిమ్ లుక్ లోకి మారిపోయిన కీర్తి సురేష్. .

Keerthi Suresh Slim Looks Viral-keerthi Suresh,slim Looks Viral,telugu Cinema,tollywood

టాలీవుడ్ లో నేను శైలజ సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి సావిత్రి బయోపిక్ గా వచ్చిన మహానటి సినిమాతో క్రేజీ హీరోయిన్ గా మారిన నటి కీర్తి సురేష్. ఇక ఈ భామ టాలీవుడ్ తో పాటు సౌత్ ఇండియాలో ప్రస్తుతం స్టార్ హీరోయిన్ గా కొనసాగుతుంది. తమిళంలో స్టార్ హీరోలతో జత కడుతున్న కీర్తి సురేష్ తెలుగులో మాత్రం సెలక్టివ్ గా సినిమాలు చేస్తుంది..

జీరో సైజుతో క్యూట్ గా మారిన మహానటి! బాలీవుడ్ సినిమా కోసమేనా-Keerthi Suresh Slim Looks Viral

రొటీన్ సినిమాలు కాకుండా తనదైన ముద్ర వేసే సినిమాలు చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇస్తుంది. ప్రస్తుతం ఓ లేడీ ఓరియంటెడ్ సినిమాలో ఈ భామ నటిస్తుంది. ఈ యువ దర్శకుడు ఈ సినిమాని తెరకేక్కిస్తున్నాడు.

ఇదిలా ఉంటే మరో వైపు ఆది పినిశెట్టి కాంబినేషన్ లో బాలీవుడ్ దర్శకుడు నగేష్ కుకుమార్ దర్శకత్వంలో ఓ తెలుగు సినిమా కూడా ఈ భామ నటిస్తుంది.ఇదిలా ఉంటే కీర్తి సురేష్ మహానటి సినిమా కోసం కాస్తా లావుగా తయారైంది. ఇక ఆ తరువాత కూడా తమిళంలో చేసిన సినిమాలలో ఆమె లావుగానే కనిపించింది.

అయితే ఈ లుక్స్ టాలీవుడ్ ఆడియన్స్ కి భాగా కనెక్ట్ అయ్యింది. ఇదిలా ఉంటే కీర్తి సురేష్ కి సంబంధించిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. కీర్తి సురేష్ ఈ ఫోటోలలో జీరో సైజు లుక్స్ తో నాజూకుగా కనిపిస్తుంది.

కీర్తి ఇంత సడెన్ గా స్లిమ్ లుక్ లోకి ఎలా మారిపోయిందా అని ఇప్పుడు చర్చించుకుంటున్నారు. అయితే ఈ లుక్ హిందీలో బోనీ కపూర్ నిర్మిస్తున్న సినిమా కోసం అనే టాక్ వినిపిస్తుంది. ఏది ఏమైనా కీర్తి ప్రెజెంట్ లుక్స్ కచ్చితంగా ఒక్కసారి చూసి ఆస్వాదించాల్సిందే.