పోస్ట్ వెడ్డింగ్ అంటూ ఫోటోలు షేర్ చేసిన కీర్తి సురేష్.. నెట్టింట్లో వైరల్!

తెలుగులో మహానటి సినిమాతో మంచి సక్సెస్ అందుకున్న కీర్తి సురేష్ గురించి అందరికీ పరిచయమే.ఈ ముద్దుగుమ్మకు ఈ సినిమాతోనే కెరీర్ మరింత మొదలైందని చెప్పవచ్చు.

 Keerthi Suresh Shares Photos Of Post Wedding Photo Goes Viral On Social Media ,-TeluguStop.com

వరుస సినిమాలలో అవకాశాలు అందుకుని స్టార్ హీరోల సరసన నటించి స్టార్ హీరోయిన్ గా నిలిచింది.

ఇక సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటుంది కీర్తి సురేష్.

అతి తక్కువ సమయంలో మంచి ఫాలోయింగ్ సొంతం చేసుకుంది. ఒకప్పుడు బొద్దుగా ఉండే ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు పూర్తిగా సన్నబడి నాజూగ్గా తయారైంది.

పైగా డ్రెస్సింగ్ స్టైల్ ను కూడా మార్చేసింది.ఇక గ్లామర్ ను కూడా పరిచయం చేస్తుంది.

ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న కీర్తి సురేష్ ఇటీవలే సర్కారు వారి పాటతో మంచి సక్సెస్ అందుకుంది.

ఇక సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన ఫోటోలను, వీడియోలను అభిమానులతో ఎప్పటికప్పుడు షేర్ చేస్తూ ఉంటుంది.

అప్పుడప్పుడు కొన్ని ఫన్నీ వీడియోలను కూడా బాగా షేర్ చేస్తూ ఉంటుంది.ఇదిలా ఉంటే తాజాగా పోస్ట్ వెడ్డింగ్ అంటూ కొన్ని ఫోటోలు పంచుకుంది.ప్రస్తుతం సినిమాలకు కాస్త బ్రేక్ తీసుకొని తన సొంత రాష్ట్రం కేరళ కి వెళ్ళింది.

Telugu Keerthi Suresh, Tollywood-Movie

అక్కడ ఉన్న ఫ్రెండ్స్ తో కలిసి బాగా సందడి చేస్తుంది.అంతే కాకుండా అక్కడ తన స్నేహితురాలి పెళ్లికి హాజరు కాగా ఆ పెళ్లి లో దిగిన ఫోటోలను పంచుకుంది.ఇక అందులో మరో హీరోయిన్ కళ్యాణి ప్రియదర్శిని కూడా ఉండగా ప్రస్తుతం.

ఆ ఫోటో కి పోస్ట్ వెడ్డింగ్ అంటూ క్యాప్షన్ ఇచ్చింది.ప్రస్తుతం ఆ ఫోటో వైరల్ గా మారింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube