ఆ పార్టీకి మద్దతుగా మహానటి కీర్తి సురేష్! త్వరలో రాజకీయాల్లోకి  

బీజేపీ పార్టీలో చేరబోతున్న కీర్తి సురేష్.

Keerthi Suresh Ready To Join Bjp Party-join Bjp Party,keerthi Suresh,malayalam,modi,national Politics,tollywood

సావిత్రి బయోపిక్ మహానటి సినిమాతో టాలీవుడ్ లో అభినవ మహానటిగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న నటి కీర్తి సురేష్. ఈ భామ మహానటి సినిమా తర్వాత టాలీవుడ్ లో చాలా గ్యాప్ తీసుకొని రీసెంట్ గా రెండు సినిమాలకి కమిట్ అయ్యింది. అందులో ఒకటి బాలీవుడ్ దర్శకుడు నగేష్ కుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతుంది..

ఆ పార్టీకి మద్దతుగా మహానటి కీర్తి సురేష్! త్వరలో రాజకీయాల్లోకి-Keerthi Suresh Ready To Join BJP Party

ఇదిలా ఉంటే తాజాగా కీర్తి సురేష్ గురించి టాలీవుడ్ లో ఓ ఆసక్తికరమైన వార్త వినిపిసితుంది. కీర్తి సురేష్ త్వరలో బీజేపీ పార్టీలో చేరబోతుంది అనేది తాజాగా సోషల్ మీడియాలో వినిపిస్తున్న మాట. అయితే ఈ మాట ఏదో అలా ఎవరో క్రియేట్ చేసింది మాత్రం కాదు.

తాజాగా మలయాళీ నటులు ప్రధాని నరేంద్ర మోడీని కలిసి ఎన్నికల సందర్భంగా తమ మద్దతు తెలియజేసారు. వారిలో కీర్తి సురేష్ తల్లి ఒకప్పటి హీరోయిన్ మేనక కూడా ఉన్నారు. ఇక కీర్తి తండ్రి నిర్మాత సురేష్ కూడా బీజేపీ పార్టీ తరుపున క్రియాశీల రాజకీయాలలో ఉన్నాడు.

ఈ నేపధ్యంలో భవిష్యత్తులో కీర్తి సురేష్ కూడా తండ్రి, తల్లి దారిలో బీజేపీ పార్టీలో చేరే అవకాశాలు ఉన్నాయని ఇప్పుడు చెప్పుకున్తున్న్నారు.