మహారాణి లుక్ లో మెరిసిపోతున్న మహానటి కీర్తి సురేష్

మహానటి సినిమాతో జాతీయ ఉత్తమ నటిగా గుర్తింపు తెచ్చుకున్న కీర్తి సురేష్ తరువాత తెలుగులో ఆ స్థాయిని అందుకోలేకపోతుంది.ఈ నేపధ్యంలో మహానటి తర్వాత తెలుగులో ఆమె నటించిన సినిమాలు అన్ని కూడా ఫ్లాప్ అవుతూ వస్తున్నాయి.

 Keerthi Suresh Queen Look In Marakkar Movie-TeluguStop.com

చివరికి రీసెంట్ గా రొమాంటిక్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన రంగ్ దే సినిమా కూడా ఫ్లాప్ అయిపొయింది.అయితే ఈ సినిమాల ఫ్లాప్ కి కారణంగా స్టొరీ నేరేషన్ ఒకటైతే.

కీర్తి సురేష్ ఇమేజ్ పెర్ఫార్మెన్స్ ని ఆడియన్స్ మహానటితో ఇంకా పోల్చుకోవడం కూడా ఒక రీజన్ గా కనిపిస్తుంది.మహానటి హ్యంగోవర్ నుంచి ఆడియన్స్ బయటకి రావాలని ఓ రెండేళ్ళు గ్యాప్ ఇచ్చి తెలుగులో కీర్తి సురేష్ సినిమాలు చేస్తున్న ఇంకా ప్రేక్షకులు మాత్రం ఆమెని సావిత్రిలానే చూస్తున్నారు.

 Keerthi Suresh Queen Look In Marakkar Movie-మహారాణి లుక్ లో మెరిసిపోతున్న మహానటి కీర్తి సురేష్-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

మరోవైపు ఊహించని విధంగా స్లిమ్ కావడం కూడా ఎవరికీ నచ్చలేదు.

ఆమె స్లిమ్ గా ఉన్నప్పుడు కంటే బొద్దుగా ఉన్నప్పుడే అందరికి నచ్చింది.

ఈ లుక్ కూడా మైనస్ అయ్యిందని కీర్తి సురేష్ కూడా గ్రహించడంతో మళ్ళీ కాస్తా బొద్దుగా మారడానికి ప్రయత్నం చేస్తుంది.ప్రస్తుతం కీర్తి సురేష్ సూపర్ స్టార్ మహేష్ బాబుకి జోడీగా సర్కారు వారి పాట సినిమాలో నటిస్తుంది.

మరో వైపు నగేష్ కుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన గుడ్ లక్ సఖి సినిమా రిలీజ్ కావడానికి రెడీగా ఉంది.ఈ రెండు సినిమాల మీద పాజిటివ్ బజ్ ఉండటంతో మళ్ళీ కీర్తికి బ్యాక్ టూ ఫామ్ గ్యారెంటీ అని అందరూ అనుకుంటున్నారు.

ఇదిలా ఉంటే మలయాళంలో స్టార్ హీరో మోహన్ లాల్ మెయిన్ లీడ్ లో వంద కోట్ల భారీ బడ్జెట్ తో మరక్కర్ అనే సినిమా తెరకెక్కింది.ఈ సినిమాలో కీర్తి సురేష్ మహారాణి పాత్రలో కనిపిస్తుంది.

ఆ పాత్రకి సంబంధించి లుక్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.మహారాణి పాత్రలో కీర్తి అద్బుతంగా ఉదంటూ నెటిజన్లు పొగిడేస్తున్నారు.

#Mohanlal #Keerthi Suresh #Rang De Movie #Malayalam #Mahanati

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు