ఫీలింగ్... ఎమోషన్ అంటూ పోస్ట్ పెట్టిన కీర్తి సురేష్!

కీర్తి సురేష్ అనగానే అందరికీ మహానటిగా గుర్తొస్తుంది.మహానటి సినిమా ద్వారా అలనాటి అందాల తార సావిత్రి బయోపిక్ లో నటించిన కీర్తి సురేష్ కు జాతీయ స్థాయి గుర్తింపు అవార్డు రావడం ఎంతో విశేషం.

 Actress Keerthi Suresh Post In Wiral Keerthi Suresh,instagram,coffee,tea,shop, M-TeluguStop.com

ఈ సినిమాలో నటించి అందరి చేత ‘మహానటి’ అనిపించుకున్నారు.ప్రస్తుతం కీర్తి సురేష్ చేతినిండా సినిమాలతో ఎంతో బిజీగా ఉన్నారు.

కీర్తి సురేష్ విభిన్న పాత్రలో లేడి ఓరియెంటెడ్ గా నటించిన ‘మిస్ ఇండియా’ చిత్రం నవంబర్ 14న నెట్ ఫ్లిక్స్ లో విడుదల కానుంది.

ఈ సినిమాకు సంబందించిన ఒక ఫోటో కీర్తి సురేష్ తన ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేసిన ఫోటో ని చూసి అభిమానులు ఫిదా అవుతున్నారు.

ఆ ఫోటోలో కీర్తి సురేష్ టీ కప్పు పట్టుకొని ఎంతో క్యూట్ గా నవ్వుతూ అందరినీ ఆకట్టుకున్నారు.ఈ ఫోటోకు ఆమె కాఫీ దొరికే చోటును… షాప్ అంటారు.

చాయ్ దొరికే చోటు కొట్టు… అంటాం.ఒకటి ఫీలింగ్ మరొకటి… ఎమోషన్ అంటూ ఈ ఫోటోకి క్యాప్షన్ ఇచ్చి, ఈ ఫోటోను టీ లవర్ కి ట్యాగ్ చేశారు.

ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ ఫోటో చక్కర్లు కొడుతోంది.

మిస్ ఇండియా చిత్రం నవంబర్ 14న ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఈ చిత్రంలో చిన్నప్పటినుంచి బిజినెస్ రంగంలో రాణించాలనే లక్ష్యంతో ఉన్న మధ్య తరగతి అమ్మాయి తన లక్ష్యాన్ని విదేశాలలో ఎలా చేరుకుంది అన్న అంశంతో ఈ చిత్రాన్ని నిర్మించినట్లు దర్శకుడు నరేంద్రనాథ్ తెలిపారు.అయితే ఇప్పటికే ఈ చిత్ర ప్రచార కార్యక్రమాలలో యూనిట్ సభ్యులు బిజీగా ఉన్నారు.

వరుస సినిమాలతో ఎంతో బిజీగా ఉన్న కీర్తి సురేష్ మిస్ ఇండియా తర్వాత పలు చిత్రాలలో నటిస్తున్నారు.ఇప్పటికే ఆమె నటించిన ‘గుడ్ లక్ సఖి’ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది.

అంతేకాకుండా ‘సర్కారు వారి పాట’, ‘అణ్ణాత్తే’వీటితో పాటు మరో రెండు తమిళ సినిమాలలో కీర్తి సురేష్ నటించనున్నట్లు సమాచారం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube