‘పెంగ్విన్‌’తో నిర్మాతకు లాభమా? నష్టమా?

కీర్తి సురేష్‌ ప్రధాన పాత్రలో నటించిన ‘పెంగ్విన్‌’ చిత్రం ఇటీవలే అమెజాన్‌ ప్రైమ్‌ ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.ఆ సినిమాను అయిదు కోట్ల లోపు బడ్జెట్‌తో ఈశ్వర్‌ సుబ్బరాజు తెరకెక్కించాడు.

 Latest Update Penguin Calculate The Profit And Loss For Producer, Keerthi Suresh-TeluguStop.com

కీర్తి సురేష్‌ తో పాటు ఇతర యూనిట్‌ సభ్యులను కేవలం 35 రోజుల డేట్లతో సినిమా పూర్తి చేశాడు.అతి తక్కువ సమయంలో సినిమాను తెరకెక్కించాడు కనుకే సినిమాకు అతి తక్కువ బడ్జెట్‌ అయినట్లుగా తమిళ సినీ వర్గాల్లో టాక్‌ వినిపిస్తుంది.

తక్కువ బడ్జెట్‌తో నిర్మాణం జరిగింది కనుకే ఓటీటీ విడుదలకు నిర్మాతలు సిద్దం అయ్యారు.అమెజాన్‌ వారు పెంగ్విన్‌కు 7.5 కోట్ల రూపాయలను చెల్లించి కొనుగోలు చేయడం జరిగింది.సినిమా హిట్‌ అయితే అమెజాన్‌ వారి నుండి మరింతగా డబ్బులు వచ్చేవి.

కాని ఇప్పుడు అమెజాన్‌ నుండి డబ్బు వచ్చే అవకాశం తక్కువ.శాటిలైట్‌ రైట్స్‌ను 6 కోట్లకు అమ్మేయడం జరిగింది.దాంతో మొత్తంగా ఇప్పటి వరకు ఈ సినిమా 13.5 కోట్ల రూపాయలను దక్కించుకుంది.

Telugu Keerthi Suresh, Kollywood, Penguin, Tollywood-Movie

హిందీ డబ్బింగ్‌ మరియు శాటిలైట్‌ రైట్స్‌ ఇంకా అమ్మాల్సి ఉంది.అది ఖచ్చితంగా కోటిన్నర వరకు వచ్చే అవకాశాలున్నాయి.అంటే మొత్తంగా 15 కోట్లు అన్నమాట.సినిమాకు ఖర్చు అయ్యింది 5 కోట్లు అయితే వచ్చింది 15 కోట్లు.కనుక నిర్మాతకు ఈజీగా 10 కోట్ల లాభంగా తెలుస్తోంది.చిన్న సినిమా అయినా మంచి కంటెంట్‌ ఉండి, మంచి పబ్లిసిటీ చేస్తే మంచి లాభాలను దక్కించుకోవడం ఖాయం అనేది పెంగ్విన్‌ మేకింగ్‌ ద్వారా తెలుస్తోంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube